Jump to content

జ్యోతి రామలింగస్వామి

వికీపీడియా నుండి
రామలింగస్వామి
రామలింగస్వామి
జననం(1823-10-05)1823 అక్టోబరు 5
మరుధూరు, చిదంబరం సమీపంలో,
అదృశ్యంజనవరి 30, 1874 (వయస్సు 50)
మెట్టుపాక్కం,వడలూరు సమీపంలో, తమిళనాడు
తల్లిదండ్రులు
  • రామయ్య పిళ్ళై (తండ్రి)
  • చిన్నమ్మ (తల్లి)

జ్యోతి రామలింగ స్వామి (అక్టోబర్ 5 1823 - జనవరి 30, 1874) తమిళనాడుకు చెందిన సన్యాసి.[1] ఈయననే ప్రపంచ వ్యాప్తంగా వళ్ళలార్ అని వ్యవహరిస్తారు.[2]

ఈయన కుల బేధాలను పాటించడం అమానవీయమని ప్రచారం చేయడమే కాకుండా దానికి ఆచరించి చూపాడు. ఈయన కవిగా, గాయకుడిగా తిరు అరుప్పా అనే పేరుతో 5818 పద్యాలను రూపొందించాడు.

జననం

[మార్చు]

తమిళనాడులోని చిదంబరం సమీపంలో మరుదూరు అనే గ్రామంలో 1823, అక్టోబర్ 5 న రామయ్య పిళ్ళై, చిన్నమ్మ అనే దంపతులకు జన్మించాడు. రామయ్య పిళ్ళై కరణీకం చేసేవాడు. అంతే కాకుండా మరుదూరు, చుట్టుపక్కల గ్రామాల్లో పిల్లలకు పాఠాలు చెబుతూ జీవితం కొనసాగించేవాడు. చిదంబర నటరాజ స్వామిని ఆరాధిస్తూ ఉండేవాడు. అయిదుమందిని వివాహం చేసుకున్నాడు. ఎవరికీ సంతానం కలగలేదు. ఆరోసారి చెన్నపట్నం సమీపంలోని పొన్నేరి గ్రామానికి దగ్గర చిన్నకావణం పల్లె కు చెందిన చిన్నమ్మను వివాహం చేసుకున్నాడు. ఆమె ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులను కన్నది. వీరు సభాపతి పిళ్ళై, పరశురామ పిళ్ళై, సుందరాంబ. ఉణ్ణామలై.

అదృశ్యం

[మార్చు]

1874 జనవరి 30 న ఈయన వడలూరు సమీపంలోని మెట్టుపాక్కం దగ్గర తన గదిలోకి ప్రవేశించి తన అనుచరులతో తలుపులు మూసివేయమని ఆదేశించాడు. ఆ తలుపులు ఎన్నటికీ తెరువరాదని, అలా తెరిచినా తాను వాళ్ళకి కనిపించనని వాళ్ళకి తెలియజేశాడు. ఆయన అదృశ్యం చుట్టుపక్కల కొన్ని పుకార్లు రేకెత్తించింది. చివరికి మే నెలలో ప్రభుత్వ తహసీల్ దారు సమక్షంలో తలుపులు బద్దలుకొట్టి లోనికి ప్రవేశించారు. కానీ అక్కడ జ్యోతి తప్ప మరేమీ కనిపించలేదు. ఈ సంఘటన 1906 లో మద్రాసు గెజిట్ లో ప్రచురించబడింది.[3]

మూలాలు

[మార్చు]
  1. పి. వి, అరుణాచలం (1947). వళ్ళలార్ జ్యోతి రామలింగస్వామి. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం. Archived from the original on 2018-06-18. Retrieved 2018-07-26.
  2. Friend Henry The Light Bearer. Theosophy, Timeless Wisdom speech by Stefano Martorano Archived 2018-08-20 at the Wayback Machine
  3. The image of engraved stone in Vadalur Archived 2020-07-11 at the Wayback Machine about the Madras District Gazette's note describing the Saint Rāmalingam's disappearance incident, that took place on January 30, 1874