Jump to content

బెండపూడి అన్నయ మంత్రి

వికీపీడియా నుండి

బెండపూడి అన్నయమంత్రి కాకతీయుల మంత్రి, సైన్యాధ్యక్షుడు అనంతరకాలంలో ముఖ్యమైన నాయకుడు.[1] ప్రతాపరుద్రుడు మరణించి, కాకతీయ సామ్రాజ్యం పతనమైపోయాకా, తురుష్కుల పరిపాలనను ఎదిరించి ముసునూరి నాయకుల పరిపాలనకు బాటలువేసిన రాజకీయవేత్త. కాకతీయ పతనానంతరం సంధి యుగంలో అత్యంత ముఖ్యమైన వీరుడు అన్నయమంత్రి. కాకతీయుల కొలువులో తనతో పాటు పనిచేసిన కొలను రుద్రదేవుడు అనే సహ దేశాభిమానితో కలిసి అన్నయమంత్రి తిరుగుబాటుకు రూపకల్పన చేశాడు. చెదిరిపోయిన సైన్యాన్ని, నాయకులను అన్నయమంత్రి, రుద్రదేవుడు పోగుచేసి నూజివీడు ప్రాంతానికి చెందిన కాకతీయ నాయకుడైన ప్రోలయ నాయకుడిని వారికి నాయకుడిగా ఎన్నుకున్నారు. అనంతర కాలంలో ప్రోలయ నాయకుడి నాయకత్వంలో అద్దంకి వేమారెడ్డి, కొప్పుల ప్రోలయనాయకుడు, రేచెర్ల సింగమనాయకుడు, మంచికొండ గణపతినాయకుడు, వుండి వేంగభూపతి వంటి ముఖ్యవీరులు కలిసి వేర్వేరు చోట్ల తిరుగుబాట్లు లేవదీసి, 1326 నాటికి ఢిల్లీ సుల్తానుల సైన్యాన్ని తరిమివేసి ఓరుగల్లును విముక్తం చేశారు. అనంతరం ముసునూరి నాయకులు పాలన ప్రారంభమైంది.

కాకతీయ పాలనలో

[మార్చు]

కాకతీయ పరిపాలనలో మంత్రిగా, సైన్యాధక్షునిగా అన్నయమంత్రి బాధ్యతలు నిర్వహించేవాడు. 1303లో మాలిక్ కాఫుర్ తొలిసారి ఓరుగల్లు మీదికి దండయాత్రకు వచ్చినప్పుడు ఇతర ప్రధాన వీరులతో పాటు అన్నయమంత్రికి కూడా ప్రతాపరుద్రుడు సైన్యంలో భాగానికి నాయకత్వం ఇచ్చి పంపగా యుద్ధం చేశాడు.[2]

కాకతీయ పతనానంతరం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. సురవరం, ప్రతాపరెడ్డి. "3వ ప్రకరణం". ఆంధ్రుల సాంఘిక చరిత్ర. Retrieved 6 January 2018.
  2. శేషాద్రి రమణ కవులు, . "ప్రతాపరుద్ర చక్రవర్తి". ఆంధ్రవీరులు. Retrieved 6 January 2018. {{cite book}}: |first1= has numeric name (help)