Jump to content

కంప్యూటర్ గ్రాఫిక్సు

వికీపీడియా నుండి
బ్లెండర్ 2.45 అప్రమేయ తెర, త్రీడి  నమూన  సుజన్నె ని ప్రదర్శిస్తున్న చిత్రం

కంప్యూటర్ గ్రాఫిక్స్ కంప్యూటర్ల ద్వారా సృష్టించబడిన చిత్రాలు, సినిమాలు. సాధారణంగా, ఈ పదం ప్రత్యేకమైన గ్రాఫికల్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సహాయంతో సృష్టించబడిన కంప్యూటర్-సృష్టించిన ఇమేజ్ డేటాను సూచిస్తుంది. ఇది కంప్యూటర్ సైన్స్ లో ఒక విస్తారమైన, అధునిక విభాగం. ఈ పదా న్ని1960 లో బోయింగ్ కి చెందిన కంప్యూటర్ గ్రాఫిక్స్ పరిశోధకులు వెర్నీ హడ్సన్,  విలియం ఫెటర్ ద్వారా రూపొందించారు.  ఈ పదాన్ని తరచుగా CG అనే  సంక్షిప్త రూపం లో సూచిస్తారు, ఇది కొన్నిసార్లు కంప్యూటర్-రూపొందించిన చిత్రణ (CGI) గా తప్పుగా సూచించబడింది.

యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్, స్ప్రైట్ గ్రాఫిక్స్, వెక్టర్ గ్రాఫిక్స్, 3D మోడలింగ్, షేడర్లు, GPU డిజైన్, అవ్యక్త ఉపరితలం లాంటి విషయాలు కంప్యూటర్ గ్రాఫిక్స్ లో ఉన్నాయి. రే ట్రేసింగ్ తో విజువలైజేషన్, కంప్యూటర్ విజన్ ఈ రంగానికి చెందినవే. ఈ కంప్యూటర్ గ్రాఫిక్సు లోని విధానాలు జ్యామితి, ఆప్టిక్స్,, భౌతిక శాస్త్రము లాంటి అంతర్లీన శాస్త్రముల మీద భారీగా ఆధారపడి ఉంటుంది.

కంప్యూటర్ గ్రాఫిక్స్ కళ, చిత్ర (ఇమేజ్) డేటాను వినియోగదారునికి సమర్థవంతంగా, అర్థవంతంగా ప్రదర్శించడానికి బాధ్యత వహిస్తుంది. కంప్యూటర్ గ్రాఫిక్ యొక్క అభివృద్ధి అనేక రకాల మాద్యమాలను గణనీయంగా ప్రభావితం చేసింది.  యానిమేషన్, సినిమాలు, ప్రకటనలు, వీడియో గేమ్స్,, గ్రాఫిక్ డిజైన్   రంగాలలో విప్లవాత్మక మార్పులకి కారణం అయింది.

కంప్యూటర్ గ్రాఫిక్స్ యొక్క ప్రధాన భాగాలు:

[మార్చు]

1. మోడలింగ్:

2D లేదా 3D వస్తువులు, సన్నివేశాలను సృష్టించడం. వాటి ఆకారం, పరిమాణం, స్థానం నిర్ధారించడం.[1]

2. రెండరింగ్:

3D మోడల్ నుండి తుది చిత్రం సృష్టించడం. దీంట్లో లైట్, టెక్స్చర్, కెమెరా స్థానాన్ని కలుపుతూ నిజానికి దగ్గరగా చూపించడం.[1]

3. యానిమేషన్:

స్థిర చిత్రాల్లో కదలిక సృష్టించడం, సమయం క్రమంలో కదిలినట్లు చూపించడం.[1]

4. ఇమేజ్ ప్రాసెసింగ్:

ఇప్పుడు ఉన్న చిత్రాలను మార్చడం లేదా సవరించడం. ఉదాహరణకు: రంగులను మార్చడం, ఫిల్టర్ ఎఫెక్ట్స్ పెట్టడం, అంచులను తీక్ష్ణం చేయడం.[1]

కంప్యూటర్ గ్రాఫిక్స్ ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి:[2]

[మార్చు]

1. రాస్టర్ గ్రాఫిక్స్ :

రాస్టర్ గ్రాఫిక్స్ ను బిట్‌మ్యాప్ చిత్రాలుగా కూడా పిలుస్తారు. ఇవి పిక్సెల్స్ ఉపయోగించి తయారు చేయబడతాయి. ప్రతి పిక్సెల్ ఒక చిత్రంలో ఒక బిందువు ని సూచిస్తుంది, దాని రంగు సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఈ పిక్సెల్స్ క్రమంగా అమర్చబడినప్పుడు పూర్తిగా చిత్రం ఏర్పడుతుంది. రాస్టర్ గ్రాఫిక్స్ ఎక్కువగా డిజిటల్ ఫోటోగ్రఫీ, వీడియో గేమ్స్ లో ఉపయోగిస్తారు ఎందుకంటే ఇవి వివరమైన, నిజానికి దగ్గరగా ఉన్న చిత్రాలను చూపించగలవు.[2]

2. వెక్టర్ గ్రాఫిక్స్ :

వెక్టర్ గ్రాఫిక్స్ ను గణిత సూత్రాలు ఉపయోగించి రూపొందిస్తారు, ఇవి ఆకారాలు, లైన్‌లు, వస్తువులను నిర్వచిస్తాయి. పిక్సెల్స్ బదులు, వెక్టర్ గ్రాఫిక్స్ బిందువులు, రేఖలు, వంకరలు ఉపయోగించి అంశాలను సూచిస్తాయి. దీనివల్ల చిత్రాలను నాణ్యత కోల్పోకుండా పెద్దదానిగా లేదా చిన్నదానిగా మార్చడం సులభం అవుతుంది. వెక్టర్ గ్రాఫిక్స్ ఎక్కువగా గ్రాఫిక్ డిజైన్, ఆర్కిటెక్చరల్ డిజైన్, ఇల్లస్ట్రేషన్ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.[2]

సంక్షిప్తంగా

[మార్చు]

  "కంప్యూటర్లు  లో అక్షరాలు లేదా ధ్వని కాని  ఇతర విషయాలను", ఒక విశాలమైన అర్ధంలో వివరించడానికి  కంప్యూటర్ గ్రాఫిక్సు అనే పదం ఉపయొగిస్తారుసాధారణంగా, ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ అను పదం  అనేక విషయాలు సూచిస్తుంది.:

  • కంప్యూటర్ ద్వారా చిత్ర డేటాను సూచించడానికి, మార్చటానికి .
  • వివిధ సాంకేతికతలను ఉపయోగించే చిత్రాలను  సృష్టించడానికి, మార్చటానికి
  • ఇది కంప్యూటర్ సైన్స్ యొక్క ఉప-విభాగం, ఇది డిజిటల్ విజువల్ కంటెంట్ ను సంశ్లేషణ  (సింథసిస్) చేయడం, అభిసంధానం చేయడం కోసం పద్ధతులను అధ్యయనం చేస్తుంది.

References

[మార్చు]
  1. 1 2 3 4 "Computer Graphics and Multimedia: Types, Applications, Job Roles". www.ccbp.in (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-11-17.
  2. 1 2 3 "Exploring Computer Graphics: Types, Applications And User Engagement". TimesPro (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-11-17.