మల్లోజుల వేణుగోపాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మల్లోజుల వేణుగోపాల్ (సాధన) కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. అతను భారతదేశంలో నిషేధించబడిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) కేంద్రకమిటీలో సభ్యుడు, పాలిట్ బ్యూరో సభ్యుడు.

కుటుంబం[మార్చు]

అతను సుధీర్ఘకాలం మావోయిస్టు పార్టీలో అగ్రనాయకత్వంలో పనిచేసిన కిషన్ జీ (మల్లోజుల కోటేశ్వరరావు) కు తమ్ముడు.[1][2] అతను తెలంగాణ రాష్ట్రలోని కరీంనగర్ జిల్లా కు చెందిన పెద్దపల్లిలో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. అతని తాత, తండ్రి మల్లోజుల వెంకటయ్య లు భారత స్వాతంత్ర్యసమరయోధుడు. [3][4] అతను వామపక్ష తీవ్రవాదంలో చేరిన తరువాత 30 సంవత్సరాలపాటు ఇంటిని వదిలి దూరంగా ఉన్నాడు.

కార్యకలాపాలు[మార్చు]

అతను పూర్వపు పీపుల్స్ వార్ గ్రూపులో నాయకునిగా భూపతి, సోనూ, మాస్టర్, అభయ్ వంటి పేర్లతో పనిచేసాడు. అతను మహారాష్ట్ర రాష్ట్రంలోని గార్చిరౌలీ ప్రాంతంలో గల మావోయిస్టుల దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీకి అధిపతిగా పనిచేసాడు. [5] అతను దక్షిణ భారత దేశంలోని పశ్చిమ కనుమలకు రెండు వైపులా, కేరళ లోని గోవా నుండి ఇడుక్కి వరకు గల గెరిల్లా జోన్ ను నెలకొల్పడానికి నియమింపబడ్డాడు.[6] 2010లో చెరుకూరి రాజ్‌కుమార్ (ఆజాద్) మరణం తరువాత అతను సి.పి.ఐ (మావోయిస్టు) పార్టీకి అధికార ప్రతినిధిగా నియమింపబడ్డాడు. అతను పార్టీలో ప్రచురణల విభాగంలో నిర్వహణా భాద్యతలను స్వీకరించాడు. [7] ఏప్రిల్ 2010 దంతెవాడ ఘటన లో 76మంది సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్సు కు చెందిన పోలీసుల మరణానికి వెనుక ఇతని హస్తం ఉందని పోలీలు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. [8] ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు అతని తలపై భారీ మొత్తాలను ప్రకటించారు. కిషన్‌జీ మరణం తరువాత అతనిని పశ్చిమ బెంగాల్ లో ఆపరేషన్ గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా జరితుతున్న లాల్‌గర్ ఉద్యమానికి నాయకునిగా నియమించారు.[1][2]

రచనలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Kishenji's brother Venugopal is new Maoist chief of Lalgarh". Retrieved March 1, 2018. Cite web requires |website= (help)
  2. 2.0 2.1 Tamal Sengupta. "kishenji's brother Venugopal to concentrate in Jangalmahal". Retrieved March 1, 2018. Cite web requires |website= (help)
  3. Amit Chaudhuri. "Calcutta: Two Years in the City". Retrieved March 1, 2018. Cite web requires |website= (help)
  4. "Kishenji Maoist Leader Profile". Retrieved March 1, 2018. Cite web requires |website= (help)
  5. V R Raghavan. "The Naxal Threat: Causes, State Response and Consequences". Retrieved March 1, 2018. Cite web requires |website= (help)
  6. "No dearth of leaders in CPI (Maoist)". timesofindia.indiatimes.com. Retrieved March 1, 2018.
  7. "Top Maoist leader Ganapathi admits to leadership crisis in party". tehelka.com. September 19, 2013. మూలం నుండి 2018-05-19 న ఆర్కైవు చేసారు. Retrieved March 1, 2018.
  8. "The men who run Dandakaranya". financialexpress.com. Retrieved March 1, 2018.