ఆంధ్ర భాషా సంజీవని
స్వరూపం
ఆంధ్ర భాషా సంజీవని 1871 లో కొక్కొండ వెంకటరత్నం పంతులు చే మద్రాసు లో ప్రారంభించబడిన మాస పత్రిక.[1] తెలుగులో వచ్చిన తొలితరం తెలుగు పత్రికల్లో ఇది ఒకటి. ఇది 1883 దాకా కొనసాగి తొమ్మిది సంవత్సరాల పాటు ఆగిపోయి 1892 లో మళ్ళీ మొదలయ్యి 1900 దాకా కొనసాగింది. తొలిసంచిన విడుదలతోనే పండితుల ప్రశంసలు అందుకుంది. కందుకూరి వీరేశలింగం పంతులు సంపాదకుని లేఖ ద్వారా తన ప్రశంసలు అందజేశారు. ఆయన రాసిన మహాభారతం, సభాపర్వం ఈ పత్రికలో ధారావాహికగా ప్రచురించారు.
ఈ పత్రిక ప్రాచుర్యానికి కారణాలు
- ప్రజలు మాట్లాడే భాష పేరునే పత్రిక పేరులో చేర్చడం, గ్రాంథిక భాష వాడటం
- అనేక ఆంగ్లపదాలకు శ్రమకోర్చి తెలుగు పదాలను కనిపెట్టి వాడటం. వీటిలో చాలా పదాలను వీరేశ లింగం పంతులు తన రచనల్లో వాడాడు.
- సాహిత్య సంబంధ వ్యాసాలే కాక రాజకీయ, సాంఘిక అంశాలను ప్రాధాన్యత నివ్వడం
వేంకటరత్నం, వీరేశలింగం మధ్యన వితంతు వివాహం, ఆడవారి చదువులు, సాంఘిక సంస్కరణల విషయంలో బేధాభిప్రాయాలు ఏర్పడ్డపుడు ఇద్దరూ తమ తమ పత్రికల్లో వ్యాసాలా ద్వారా వాద ప్రతివాదాలు జరిపారు.
మూలాలు
[మార్చు]- ↑ జి., సోమశేఖర్ (30 December 1993). "The Role Telugu Press In The Indian Freedom Movement" (PDF). p. 47. Retrieved 27 December 2017.