Jump to content

రాగో

వికీపీడియా నుండి

దళజీవితాన్ని, దళాలకు గ్రామీణజనజీవితంతో ఉన్న అనుబంధాన్ని, గ్రామీణ జీవితాన్ని అభివృద్ధికరంగా మార్చడం, 16 దళాలు నిర్వహించే పాత్రను, దళాలకు, ప్రభుత్వ పోలీసు యంత్రాంగానికి, మధ్య నడిచే రాజకీయ వ్యవహారాన్ని వస్తువుగా చేసుకుని, సామాజిక నవల, పోరాట నవలగా మలుచుకున్న నవల ‘‘రాగో’’ (సాధన). బలవంతపు పెళ్ళి నిర్బంధాల నుంచి విపరీతంగా పెనుగులాడి బయటపడి దళంతో కలుస్తుంది ‘‘రాగో’’. తను అనుభవించిన క్షోభ – స్వేచ్ఛకోసం పడే ఆరాటం, మీడియా స్తీలందరిలోనూ చూస్తుంది రాగో. పంజరం లాంటి జీవితం నుంచి ఏ కట్టుబాట్లు లేని అరణ్యంలోకి, అక్కడి నుంచి ఆశయ పథంలోకి పయనించింది.[1] దీనిని మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సాధన రాసాడు[2]

రాగో నవల 1993లో మొదటి ప్రచురణ ప్రారంబం అయ్యింది .రాగో అంటే గోండి భాషలో రామచిలుక అని అర్ధం .గోండుల సంప్రదాయాలలో గిరిజన స్త్రీ పడే అవస్తలను యీ నవల తెలియజేస్తుంది .రాగో ఒక యుక్త వయస్కురాలైన ఒక యువతీ .తనకు ఇష్టం లేని వివాహంతో తను ప్రేమించిన నాన్సు కోసం తల్లిదండ్రులతో పోరాడి చివరకు ఇంటినుంచి పారిపోతుంది .అప్పుడు అన్నలతో తాను అనుభవించిన కష్టాలు భాయతి సామజంలో లేవని తెలుసుకుంటుంది . రాగో ఎలాగైనా గిరిజనుల్లో చైతన్యం తేవాలని అనుకుంటుంది .అదేవిదంగా గిరిజనుల్లో కొంత మార్పు తెస్తుంది .అదేవిదంగా రాగో నీటి సామజంలో స్త్రీ పడుతున్న భాదల నుంచి స్త్రీని తక్కువ చూడటం వంటి వాటిని నిరసిస్తూ పోరాటం చేసింది .రాగో తండ్రి కూడా పార్టీ సభ్యాత్వాన్ని అంగీకరించడంతో యి నవల ముగుస్తుంది .

రచయిత ఇతర రచనలు

[మార్చు]
  • సరిహద్దు _1993 జనవరి _విరసం ప్రచురణలు .
  • రాగో _1993 నవంబరు _సృజన మొదటి ప్రచురణ.
  • రాగో _1996 జనవరి _సృజన రెండవ ప్రచురణ . .

రచయిత నేపధ్యం

[మార్చు]

రాగో అంటే రామచిలుకే గాని పంజరంలో చిలుక కాదు .అక్కడ ఉండే మూడాచారాలను మనస్సు లేని మానవులను ఎదిరించి అక్కడ నుంచి ఆశయంలోకి పయనించిన వీర వనిత రాగో .మట్టి మనుషులు, అడివి మనుషులుగా ఉన్న వారిని గొప్ప వ్యక్తులుగా చారిత్రక క్రమానికి నిదర్శనం రాగో . అడవి కడుపులో ఆయుధంతో అనునిత్యం కత్తి అంచు మీద నడుస్తూనే ఉండటానికి కలం సహకరించదు . కనుక క్రమశిక్షణకు లోబడి పనిచేసినది సృజన . అడవిలో మనుషులు ఉంటారు ఆ మనుషులకు అభిమానాలు ఉంటాయని ఆ మనుషుల మధ్య మరో ప్రపంచపు మనుషులు కలసి అనురాగాలు అభిమానాలకు ఒక అందమైన ప్రపంచం కొరకు పోరాటం చేస్తున్నారు .సాధన నవలలు సరిహద్దు, రాగో సాదికరికంగా ప్రతిపలిస్తాయి .

రచయిత గురించి

[మార్చు]

సాధన రచయితగానే కాకుండా అతను సాహిత్యం ద్వారా అన్వేషించిన ప్రశ్నలు, చెప్పిన అనుభవాలు బహుశ సాహిత్యం చదివె చాల మందికి ..కొత్త ఆదివాసుల గురించి వచ్చిన సాహిత్యం చాల తక్కువ ఎందుకంటె వాళ్ళు సభ్య సమాజానికి దూరంగా ఉండటమే. 1885 తర్వాత కాలానికి సంబంధించినది సాధన సరిహద్దు నవల .ఈ నవలలో విప్లవ దొరని కనిపిస్తుంది .సాధన రెండో నవల రాగో ఒక రకంగా సరిహద్దు నవల కొనసాగింపుల కనిపిస్తుంది .రెండు నవలలో ఒకే పాత్రలు ఉంటాయి కానీ ఈ నవల వస్తువు రూపంలో పూర్తిగా భిన్నమైనది ...

రాగో నవల ఉద్దేశం

[మార్చు]
  • టాగో రామచిలుకలా స్వేచ్ఛగా ఆకాశంలో ఎగురాలనుకుంది .మనిషిని మనిషి చేరుకోవడానికి ఉన్న సమస్త అడ్డంకులను ప్రశ్నించింది .
  • రాగో లాగే మనుషులంతా ఎగురాలనే తీవ్రమైన అన్వేషణలో ఉన్నారు .
  • తన్ను తాను తెలుసుకోవడమే కాదు తనలాంటి వాళ్ళను తనతో పాటు రాగో తీసుకురాగలడా ?
  • ప్రపంచం అతలాకుతలంగా ఉన్న ఈ సమయంలో భవిష్యత్ రాగో మీద ఆదారపడి ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "1991 – 2005 తెలుగు నవల – విస్తరించిన వివిధ కోణాలు".
  2. "తన కొడుకు రాసిన నవలను ఆవిష్క‌రించిన కిషన్ జీ తల్లి మధురమ్మ‌".

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రాగో&oldid=3701704" నుండి వెలికితీశారు