గదర్ పార్టీ
గదర్ పార్టీ | |
---|---|
అధ్యక్షుడు | సోహన్ సింగ్ భక్నా |
వ్యవస్తాపకుడు | కర్తార్ సింగ్ సరభ |
స్థాపన | 1913 |
రద్దు | 1919 |
Preceded by | పసిఫిక్ తీర హిందీ సంఘం |
సిద్ధాంతం | భారత స్వాతంత్ర్యోద్యమము |
రంగు | ఎరుపు, కుంకుమ, ఆకుపచ్చ |
గదర్ పార్టీ భారత స్వాతంత్ర్యోద్యమము కాలంలో పంజాబీలు స్థాపించిన భారతీయ విప్లవ సంస్థ. హిందూ, సిక్కు, ముస్లిం నాయకుల సమ్మేళనంతో ఏర్పడింది. 1913లో బ్రిటీష్ పాలనతో సంబంధరహితంగా విదేశాలనుండి భారతదేశానికి పనిచేయడం ప్రారంభమై, భారత స్వాతంత్ర విప్లవోద్యమంలో భాగంగా భారతదేశంలోని విప్లవకారులతో కలిసి పనిచేయడమేకాకుండా వారికి ఆయుధాలను, మందుగుండు సామగ్రిని అందించడానికి సహాయపడింది.
ఈ పార్టీ ప్రధాన కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. ఇందులో భాయ్ పర్మానంద్, సోహన్ సింగ్ భక్నా, హర్ దయాల్, మొహమ్మద్ ఇక్బాల్ శేదై, కర్తార్ సింగ్ సరభ, అబ్దుల్ హఫీజ్ మహ్మద్ బరకాతుల్లా, సులామన్ చౌదరి, అమీర్ చౌదరి, రష్బీరి బోస్, గులాబ్ కౌర్ తదితరులు కీలక సభ్యులుగా ఉన్నారు.
ఏర్పాటు[మార్చు]
1910 దశకంలో వాషింగ్టన్, ఒరేగాన్ రాష్ట్రాల్లోని కట్టెల మిల్లులలో, కాలిఫోర్నియాలోని వ్యవసాయ భూములలో పనిచేయడానికి పంజాబ్ రాష్ట్రం నుండి చాలమంది కార్మికులు వెళ్ళారు. అయితే అక్కడ పనిచేస్తున్న తెల్లజాతీయుల జీతంకంటే, భారతీయులకు తక్కువ జీతం చెల్లించడంతోపాటూ వివక్ష, చిన్నచూపు చూపించేవారు. అలా ఇంగ్లీషువారిపై కోపం పెంచుకున్న భారతీయులు, దేశానికి స్వాతంత్య్రం వస్తేనేగాని తమ జీవితాలు మారవని అర్థంచేసుకున్నారు. మొదటిసారిగా 1913 ఏప్రిల్‌లో ఒరేగాన్‌లోని అస్టోయియాలో భారతీయ కార్మికులు సమావేశమై, 'పసిఫిక్ తీర హిందీ సంఘం'ను ఏర్పాటు చేసుకున్నారు. సంఘం ప్రధాన కార్యాలయంపైన యుగంతర్ ఆశ్రమ్ (శాన్‌ఫ్రాన్సిస్కో) లో సంఘం నుండి 1913 నవంబరు ఒకటవ తేదీన 'గదర్' అనే ఒక వారపత్రికను ప్రారంభించింది.[1]
గదర్ అనే పేరు వెనుక చాలా నేపథ్యమే ఉంది. 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర పోరాటాన్ని బ్రిటిషు వారు 'గదర్' (తిరుగుబాటు)గా పిలిచేవారు. ఆ పోరాటాన్ని కొనసాగించి, అంతిమంగా దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయడమే లక్ష్యం కాబట్టి పత్రికకు ఆ పేరునే ఖరారు చేశారు. కాలక్రమేణా ఆ సంఘమే 'గదర్ పార్టీ'గా ప్రసిద్ధికెక్కింది.
పేరు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-07. Retrieved 2018-08-13.