Jump to content

గండా సింగ్

వికీపీడియా నుండి

గండా సింగ్, గదర్ పార్టీలో ప్రముఖ సభ్యుడు. ఫిరోజ్‌పూర్ అతడి స్వస్థలం. అతను చైనాలోని హాంకౌలో కొంతకాలం నివసించాడు. అక్కడ అతను 1926 లోచియాంగ్ కై-షేక్‌ను కలుసుకున్నాడు. 1927 లో MN రాయ్ ను కలుసుకున్నాడు. షేక్‌ను కలుసుకున్న సమయంలో గదరైట్ కార్యకలాపాలకు కేంద్రంగా ఏర్పడిన సిక్కు గురుద్వారాను సందర్శించినపుడు, అతను బ్రిటిష్ వ్యతిరేక ప్రసంగం చేసినట్లు నివేదికలు వెళ్ళాయి. సింగ్ అప్పుడు హిందుస్థాన్ గదర్ దండోరా సిబ్బందిలో భాగంగా ఉన్నాడు. అతను 1927 అక్టోబరులో నాన్‌కింగ్‌ వెళ్లాడు. అక్కడ అతను హిందుస్థాన్ గదర్ దండోరా సంపాదకుడిగా పనిచేశాడు. ప్రాచ్య అణగారిన పజల సంఘపు శాఖను కూడా నిర్వహించాడు. అతను నాంకింగ్‌కు వెళ్లినప్పుడు 1927లో అర్జున్ సింగ్, ఉధమ్ సింగ్‌లూ, 1929లో ఇతరులూ అతనితో చేరారు. తదనంతర కాలంలో దేశం నుండి బహిష్కరించబడిన గదర్ పార్టీ నాయకుల బృందంలో అతను కూడా ఉన్నాడు. [1]

మూలాలు

[మార్చు]
  1. Deepak, B. R. (2001). India — China Relations in the First Half of the Twentieth Century. New Delhi: APH Publishing. pp. 76–80. ISBN 9788176482455. Retrieved 2012-05-15.