రామచంద్ర భరద్వాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామచంద్ర భరద్వాజ్

రామచంద్ర భరద్వాజ్ 1914 - 1917 మధ్య గదర్ పార్టీకి అధ్యక్షుడుగా పనిచేసాడు. ఇతన్ని పండిట్ రామచంద్ర అని అంటారు. అతను, హిందూస్థాన్ గదర్ పత్రిక వ్యవస్థాపక సంపాదకులలో ఒకడు. ఇండో-జర్మన్ కుట్రలో కీలకమైన నాయకుడు. 1914 లో లాలా హర్ దయాళ్ స్విట్జర్లాండ్ వెళ్ళిన తర్వాత, రామచంద్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు. జరిగిన కోమగట మారు సంఘటన నేపథ్యంలో, ఫిబ్రవరిలో చెయ్యాలని తలపెట్టిన తిరుగుబాటు కోసం భగవాన్ సింగ్, మౌల్వీ మొహమ్మద్ బర్కతుల్లాతో కలిసి పసిఫిక్ తీరంలో దక్షిణాసియా కమ్యూనిటీ మద్దతును సమీకరించడంలో కీలకపాత్ర పోషించారు. రామచంద్ర బ్రిటిషు వారి ఏజెంటని భావించిన తోటి కుట్రదారు రామ్ సింగ్, హిందూ -జర్మన్ కుట్ర విచారణ చివరి రోజైన 1918 ఏప్రిల్ 24 న రామచంద్రను హత్య చేసాడు.

మూలాలు

[మార్చు]