మహానటి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహానటి
దర్శకత్వంనాగ్ అశ్విన్
నిర్మాతఅశ్వినీ దత్, ప్రియాంకా దత్, స్వప్నా దత్
రచనబుర్రా సాయిమాధవ్ (మాటలు)
కథనాగ్ అశ్విన్
నటులుదుల్కర్ సల్మాన్
కీర్తీ సురేష్
విజయ్ దేవరకొండ
సమంత
సంగీతంమిక్కీ జె. మేయర్
ఛాయాగ్రహణండానీ సంచెజ్- లోపెజ్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ
విడుదల
మే 9, 2018 (2018-05-09)
దేశంభారతదేశం
భాషతెలుగు
తమిళం

తెలుగులో మహానటిగా, తమిళంలో నడిగైయర్ తిలగం గా తెరకెక్కిన ఒకప్పటి దక్షిణ భారత సినీనటి సావిత్రి జీవిత కథ మహానటి సినిమా. ఈ సినిమాకు దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు - సి. అశ్వినీదత్, స్వప్నా దత్, మరియు ప్రియాంకా దత్. ఈ సినిమా వైజయంతి మూవీస్ మరియు స్వప్న సినెమా బ్యానర్స్ కింద విడుదలయింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్ నటించగా, దుల్కర్ సల్మాన్, సమంత అక్కినేని, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్ మరియు భానుప్రియ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. మిక్కి జె మెయెర్ చిత్రానికి సంగీతం అందించారు. సినిమా నిర్మాణం మే 2017 లో మొదలై 9 మే 2018న సినిమా విడుదల అయింది.

నేపధ్యము[మార్చు]

ఈ చిత్రం మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా ప్రియాంకా దత్ నిర్మిస్తున్న ఈ సినిమా 2017 మేలో చిత్రీకరణ ప్రారంభించుకుంది. 2018 మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు.[1]

తెలుగులో మహానటి గా మరియు తమిళంలో నడిగయర్ తిలగం గా ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు 2017 మేలో హైదరాబాదు లోని రామకృష్ణ స్టుడియోస్ లో ప్రారంభమయ్యాయి.[2][3]

కథ[మార్చు]

బెంగుళూరులో ఒకనాటి ప్రముఖ సినీ నటియైన సావిత్రి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనిస్తాడు ఆమె కొడుకు. ఆమెను ఆసుపత్రికి తరలించిన తర్వాత కోమాలోకి వెళ్ళిపోతుంది. చాలా వార్తా పత్రికలు ఇది ఒక చిన్న సంఘటనగా వార్త ప్రచురిస్తారు. కానీ ఆ ఘటన వెనుక ఉన్న కారణాలు ఎవరికీ తెలియరావు. ప్రజావాణి పత్రికలో పనిచేసే పాత్రికేయురాలు మధురవాణి మొదట్లో అయిష్టంగానే ఈ వార్త స్వీకరించి ఆసక్తి కొద్దీ ఆమె జీవితం గురించి తెలుసుకోవడం మొదలు పెడుతుంది.

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Samantha Akkineni wraps up Mahanati, all set to holiday with hubby Naga Chaitanya". India Today (ఆంగ్లం లో). 20 March 2018. Retrieved 22 March 2018.
  2. "Mahanati, biopic on iconic actress Savitri, officially launched – Pinkvilla South". Pinkvilla South (ఆంగ్లం లో). Retrieved 14 September 2017.
  3. "Mahanati starts rolling in Hyderabad today – Times of India". The Times of India. Retrieved 14 September 2017.

బయటి లింకులు[మార్చు]