బడుగు భాష
బడుగు భాష, ద్రావిడ భాష జాబితాల్లో ఒకటి . ఇది దక్షిణ భాష కుటుంబానికి చెందిన కన్నడం, మళయాలం, తమిళం భాషలలో ఒకటి. ఇది నీలగిరి ప్రాంతాలలో ఆదిమవాసుల వ్యవహారిక భాష. ఈ భాషను కొందరు భాష శాస్త్రవేత్తలు కన్నడభాష మాండలికాన్ని పోలి ఉందంటారు. 10 శతాబ్దంలో విడిపోయి ప్రత్యేక భాషగా ఏర్పడిందనేది ఒక వాదన. ఆర్.బి. స్విన్‌టన్ అనే భాషా పరిశోధకుడు దీనిపై పరిశోధన చేసారు. ఈ భాషను మాట్లాడే వారు ఈ ప్రాంతంలో సుమారు 90 వేల మంది ఉంటారని అతను అంచనా వేసాడు. ఇక్కడే కాక ఒరిస్సా ప్రాంతంలో కూడా ఈ భాషను మాట్లాడే వారు ఉన్నట్టుగా గుర్తించాడు.
ఇతరాలు
[మార్చు]బడుగు పేరుతో ఒక పండగను కూడా జరుపుతారు.కెరమెరి ఏజేన్సీ మండలాల్లో బడుగు ఉత్సవాన్ని ప్రజలు ఘనంగా జరుపుతారు. కెరమెరి మండలంతో పాటు జైనూర్, సిర్పూర్ (యు), ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లి తదితర మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఈ పండుగను అత్యంత ఉత్సాహంగా జరుపుతారు. పొలాల అమవాస్య తెల్లారి జరుపుకొనే పండుగను బడుగు పండుగ అంటారు. ఈ నేపథ్యంలో పొలాల పండుగ రోజు చేసిన నైవేద్యాన్ని ఊరు శివారులో ప్రత్యేక పూజలు జరిపి ఎద్దు దగ్గర ఈ నైవేద్యాన్ని సమర్పిస్తారు. చేతిలో కర్ర తీసుకొని ఇళ్లల్లో ఉండే దోమలు, వ్యాధులు, క్రీములు, క్రీటకాలను తొలగిస్తూ వివిధ రకాల నినాదాలు చేస్తూ ఊరు భయటకు వెళ్తారు. ఇలా చేయడం వల్ల దోమలు, ఈగలు వ్యాప్తి తగ్గుతుందని వారి నమ్మకం. శ్రావణ మాసంలో ఎలాంటి విందు భోజనానికి తావు లేకుండా మాంసాహరం తినకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. పొలాల పండుగ తెల్లారి నుండి మళ్లీ యధావిధిగా గడుపుకోవడానికి ప్రత్యేకగా నిలుస్తుంది.ఈ బడగ పండుగ.
బడుగు లిపి
[మార్చు]ఆంగ్లం, కన్నడం ఆధారంగా ఒక లిపి నిర్మాణానికి అనేక ప్రయత్నాలు చేయబడ్డాయి. కన్నడ లిపి ఉపయోగించిన మొట్టమొదటి ముద్రిత పుస్తకం 1890 లో మంగళూరు బాసెల్ మిస్ ప్రెస్ చేత "అంగ కర్తాగిబ్బ యేసు క్రిస్తన ఒళ్ళెయ సుద్దియ పుస్తక" అనే క్రిస్టియన్ పని.బడుగు భాష వ్రాయటానికి తమిళ లిపిని కూడా ఉపయోగిస్తారు.
మూలాలు
[మార్చు]- తెలుగుభాషా చరిత్ర - భద్రిరాజు కృష్ణమూర్తి
- తెలుగు భాషా కుటుంభాల చరిత్ర - విశాలాంధ్ర -http://www.visalaandhra.com/literature/article-9753
- తెలుగు భాష విశిష్టత -http://nrahamthulla3.blogspot.in/2012/07/blog-post_18.html
- తెలుగు భాష స్వరూపం - తెలుగు నేస్తం -http://telugunestam.blogspot.in/2009/07/blog-post_3618.html
- http://www.suryaa.com/local-news/article.asp?category=1&ContentId=142509[permanent dead link]