అంపశయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంపశయ్య
అంపశయ్య పుస్తక ముఖచిత్రం
కృతికర్త: అంపశయ్య నవీన్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): నవల
ప్రచురణ: ప్రత్యూష ప్రచురణలు
విడుదల:
పేజీలు: 276
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 81-87353-27-9


అంపశయ్య 1965- 1968 సంవత్సరాల మధ్యకాలంలో రచించిన తెలుగు నవల. వెయ్యేండ్ల కాలంలో గొప్ప రచనలుగా గుర్తింపు పొందిన వాటిలో ఒకటైన ఈ నవలను అంపశయ్య నవీన్ రచించాడు.[1] ఇది నవీన్ మొదటి నవల. 1969లో మొదటిసారిగా ప్రచురితమైంది. ఈ నవల పేరే రచయిత ఇంటిపేరుగా మారిపోయింది.[2]

నేపథ్యం

[మార్చు]
అంపశయ్య నవీన్

ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని విద్యార్థుల సామూహిక జీవితాన్ని, రవి అనే విద్యార్థి వైయక్తిక జీవితంతో సమన్వయం చేసి రాసిన విలక్షణ నవల ఇది. ఈ నవల ఒకానొక తెల్లవారుజామున యూనివర్సిటీ హాస్టల్ గదిలో కథానాయకుడు రవికి ఒక కల రావడంతో మొదలవుతుంది. ఆ కలకు అర్థమేమిటో రవికి బోధపడదు. ఆ కలనుంచి మేలుకున్న రవిలో మొదలైన ఆలోచనల ప్రవాహం నిరంతరంగా పరిగెడుతూ 18గంటల పాటు నడిచి చివరికి ఆ రాత్రి అదే గదిలో ముగుస్తుంది. 1970ల నాటి ఉస్మానియా విశ్వవిద్యాలయం జీవితంతోపాటు సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ గల్లీలు, సినిమా టాకీసుల కథాకమామిషు అంతా రచయిత నవలలో అక్షరబద్ధం చేశాడు.[3]

ముద్రణ

[మార్చు]

సృజన త్రైమాసిక పత్రికలో రెండు భాగాల పాటు ప్రచురితమై ఆ తర్వాత నవలగా వచ్చింది. 1969లో ప్రచురితమైన ఈ నవల 2017 వరకు 12 ముద్రణలు పొందింది. హిందీ తమిళం, ఇంగ్లీష్ భాషల్లోకి కూడా అనువాదం అయింది.

సినిమాగా

[మార్చు]

ఈ నవల జైనీ క్రియేష‌న్స్‌, ఓం న‌మో భ‌గ‌వ‌తే వాసుదేవాయ ఫిలింస్ పతాకంపై విజయలక్ష్మి జైని నిర్మాణ సారధ్యంలో ప్రభాకర్ జైని దర్శకత్వంలో 2016లో క్యాంపస్ అంపశయ్య సినిమాగా వచ్చింది.[4]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రభూమి (26 March 2017). "సమకాలికులలో ఆధునికుడు అంపశయ్య నవీన్". Archived from the original on 9 ఏప్రిల్ 2017. Retrieved 11 January 2018.
  2. ఈమాట. "అంపశయ్య: మరొకసారి కొత్తగా!". eemaata.com. సుజాత. Archived from the original on 16 జనవరి 2018. Retrieved 11 January 2018.
  3. ఆంధ్రజ్యోతి (9 December 2017). "ఉస్మానియాలో పుట్టిన 'అంపశయ్య'". Retrieved 11 January 2018.[permanent dead link]
  4. 10టీవి (28 July 2016). "జాతీయ అవార్డు కోసమే సినిమా - ప్రభాకర్ జైనీ." Archived from the original on 13 నవంబరు 2016. Retrieved 11 January 2018.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
"https://te.wikipedia.org/w/index.php?title=అంపశయ్య&oldid=4351066" నుండి వెలికితీశారు