క్యాంపస్ అంపశయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్యాంపస్‌ అంపశయ్య
దర్శకత్వంప్రభాకర్ జైని
స్క్రీన్ ప్లేప్రభాకర్ జైని
దీనిపై ఆధారితంఅంపశయ్య[1]
నిర్మాతవిజయలక్ష్మి జైని
తారాగణంశ్యామ్‌కుమార్, పావని, ప్రభాకర్ జైని
ఛాయాగ్రహణంరవికుమార్ నీర్ల
సంగీతంసందీప్
నిర్మాణ
సంస్థలు
జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలింస్‌
విడుదల తేదీ
30 జూలై 2016
దేశం భారతదేశం
భాషతెలుగు

క్యాంపస్‌ అంపశయ్య 2016లో విడుదలైన తెలుగు సినిమా.[2] ‘అంపశయ్య’ నవీన్ రాసిన ‘అంపశయ్య’ నవల ఆధారంగా జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలింస్‌ బ్యానర్‌పై విజయలక్ష్మి జైని నిర్మించిన ఈ సినిమాకు ప్రభాకర్ జైని దర్శకత్వం వహించాడు.[3] శ్యామ్ కుమార్, పావని, ప్రభాకర్ జైని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూలై 30న విడుదలైంది.[4]

కథ[మార్చు]

1965- 70 ల మధ్యకాలంలో తెలంగాణాలోని ఓ మారు మూల పల్లెటూరిలో చదువుకునే ఓ మధ్య తరగతి విద్యార్థి రవి (శ్యామ్‌కుమార్) ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీకి అడ్మిషన్ పొంది ఫైనల్ ఇయర్ పరీక్షల కోసం సిద్దమవుతున్న తరుణంలో తనలోని మానసిక సంఘర్షణల కారణంగా తీవ్రమైన అభద్రతా భావానికి లోనవుతూ క్యాంపస్ అంటేనే భయపడుతుంటాడు. అసలు అతని భయానికి కారణం ఏమిటి? ఆ ఒక్కరోజు అనుభవాలు అతనికి ఎలాంటి పాఠం నేర్పాయి ? ఆ అనుభవాలేమిటి ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలింస్‌
  • నిర్మాత: విజయలక్ష్మి జైని
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రభాకర్ జైని
  • సంగీతం: ఘంటశాల విశ్వనాథ్
  • సినిమాటోగ్రఫీ: రవికుమార్ నీర్ల

మూలాలు[మార్చు]

  1. Sakshi (21 February 2016). "'అంపశయ్య' కథతో..." Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
  2. Sakshi (22 March 2016). "కన్నీటి కథ... 'అంపశయ్య'". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
  3. Sakshi (17 May 2016). "క్యాంపస్‌లో ఏం జరిగింది?". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
  4. The Times of India. (2016). "Campus Ampasayya Movie". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.