హెన్రీ కేవిండిష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హెన్రీ కేవిండిష్
హెన్రీ కేవిండిష్
జననం(1731-10-10)1731 అక్టోబరు 10
నైస్, ఫ్రాన్స్
మరణం1810 ఫిబ్రవరి 24(1810-02-24) (వయసు 78)
లండన్, ఇంగ్లాండ్
జాతీయతబ్రిటిష్
రంగములురసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం
చదువుకున్న సంస్థలుకేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం.
ప్రసిద్ధిDiscovery of hydrogen
Measured the Earth's density

హెన్రీ కేవిండిష్ FRS ( అక్టోబరు 10, 1731 - ఫిబ్రవరి 24, 1810 ) బ్రిటిష్ తత్వవేత్త, శాస్త్రవేత్త. ఈయన ప్ర్రయోగాత్మక, సైద్ధాంతిక రసాయన, భౌతిక శాస్త్రవేత్త. ఈయన హైడ్రోజన్ కనుగొనుటలో ప్రసిద్ధిగాంచాడు[1] ఆయన హైడ్రోజన్ ను "మండే వాయువు"గా అభివర్ణించాడు. దీని సాంద్రతను వివరించాడు. దీనిని మండిస్తే నీరు ఏర్పదుతుందని కనగొన్నాడు.

పట్టభద్రుడు కాలేకపోయినా పరిశోధనలు చేశాడు... ప్రచారానికి ఇష్టపడక మౌనంగా ఉండిపోయాడు... దశాబ్దాల తర్వాత ఆయన ఆవిష్కరణలు బయటపడ్డాయి... ఆ శాస్త్రవేత్త పుట్టిన రోజు ఇవాళే - 1731 అక్టోబరు 10న. రసాయన, వాతావరణ, విద్యుత్‌, హృదయ సంబంధిత రంగాల్లో ఎన్నో సిద్ధాంతాలను రూపొందించిన ఓ శాస్త్రవేత్త, భూమి సాంద్రతను కూడా కనుగొన్నాడు. తద్వారా భూమి బరువు, గురుత్వ స్థిరాంకాలను నిర్ధరించడానికి దోహదపడ్డాడు. ఆయనే హెన్రీ కేవిండిష్‌. శాస్త్రరంగంలో ప్రాముఖ్యత కలిగిన కూలుంబ్‌ నియమం, ఓమ్‌ నియమం, డాల్టన్‌ పాక్షిక పీడన నియమాల్లాంటి వాటిని ఆయా శాస్త్రవేత్తల కన్నా ముందే ఊహించినా ప్రచారం చేసుకోలేదు. ఆయన మరణానంతరం 30 ఏళ్లకు అవి బయటపడి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి.

ఫ్రాన్స్‌లోని నైస్‌ నగరంలో 1731 అక్టోబరు 10న ఓ ధనిక కుటుంబంలో పుట్టిన హెన్రీ కావిండిష్‌ (Henry Cavendish) చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. తండ్రి లార్డ్‌ ఛార్లెస్‌ శాస్త్రవేత్తే కాకుండా 'ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీ' కూడా. హెన్రీ కేంబ్రిడ్జ్‌లోఉన్నత చదువులకు చేరినా మత సంబంధమైన అధ్యయనంతో విముఖత చూపడంతో డిగ్రీ పట్టా అందుకోలేకపోయాడు. ఆపై ప్యారిస్‌లో చదివి తండ్రి లాబరేటరీలో చేరాడు. సంపన్నుడైనా విలాసాలకు అలవాటు పడకుండా నిరంతరం పరిశోధనలు చేయడం విశేషం. ఎవరితోనూ మాట్లాడకుండా ఏకాంతాన్ని కోరుకునేవాడు. హెన్రీ ప్రయోగశాలలో హైడ్రోజన్‌ వాయువును ఉత్పన్నం చేయగలిగాడు. వాతావరణంలోని గాలిపై ప్రయోగాలు చేసి అనేక ప్రాథమిక సూత్రాలు కనుగొన్నాడు. వాతావరణంలో అయిదింట నాలుగు వంతులు నైట్రోజన్‌ ఉంటే ఒక వంతే ఆక్సిజన్‌ ఉంటుందని నిర్ణయించగలిగాడు. నీరు మూలకం కాదని, హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ మూలకాల వల్ల ఏర్పడే సమ్మేళనమని నిర్ధరించాడు.

తన 70వ ఏట భూమి సాంద్రతను లెక్కించిన ప్రక్రియ 'కేవిండిష్‌ ప్రయోగం'గా పేరొందింది. విమోటన త్రాసు అనే పరికరం ద్వారా సీసపు గోళాలను అమర్చి వాటి మధ్య ఉత్పన్నమయ్యే ఆకర్షణ బలాన్ని లెక్కించడం ద్వారా భూమి సాంద్రత (density) కనుగొన్నాడు. దీని వల్ల భూమి బరువు, గురుత్వ స్థిరాంకాల గణన సాధ్యమైంది.

ఆయన మరణానంతరం తన సంపదంతా కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయానికి చెందే ఏర్పాటు చేశాడు. ఆ ధనంతోనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'కేవిండిష్‌ లాబొరేటరీ'ని నెలకొల్పారు. ఇందులో పరిశోధనలు చేసిన వారిలో మాక్స్‌వెల్‌, జేజే థామ్సన్‌, రూథర్‌ఫర్డ్‌, లారెన్స్‌ బ్రాగ్‌, ఫ్రాన్సిస్‌ క్రిక్‌, జేమ్స్‌ వాట్సన్‌, స్టీఫెన్‌ హాకింగ్‌ లాంటి గొప్ప శాస్త్రవేత్తలు ఉండడం విశేషం.

మూలాలు[మార్చు]

  1. Cavendish, Henry (1766). "Three Papers Containing Experiments on Factitious Air, by the Hon. Henry Cavendish". Philosophical Transactions. 56. The University Press: 141–184. doi:10.1098/rstl.1766.0019. Retrieved 6 November 2007.

యితర లింకులు[మార్చు]

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.