గోమటేశ్వర విగ్రహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Gommateshwara Bahubali
Gommateshwara statue
The 57ft high monolithic statue of Bahubali
ప్రాథమిక సమాచారం
ప్రదేశంShravanbelagola, Hassan district, Karnataka, India
భౌగోళికాంశాలు12°51′14″N 76°29′05″E / 12.854026°N 76.484677°E / 12.854026; 76.484677Coordinates: 12°51′14″N 76°29′05″E / 12.854026°N 76.484677°E / 12.854026; 76.484677
అనుబంధంJainism
వాస్తు సంబంధ వివరణ
లక్షణాలు

గోమటేశ్వర విగ్రహం 57-foot (17 m) ఎత్తు కలిగిన ఏకశిలా విగ్రహం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని విద్యగిరి గొండపై ఉన్న శ్రావణబెళగొళలో ఉంది.[1]

విశేషాలు[మార్చు]

ఇది బ్రహ్మాండమైన ఏకశిలా విగ్రహమైన గోమటేశ్వర అను జైన సన్యాసి విగ్రహం. దీనిని బాహుబలి పేరుతో కూడా పిలుస్తారు. గంగా రాజైన రాచమల్ల (రాచమల్ల సత్యవాక్ IV క్రీ.శ.975-986) కు మంత్రి అయిన చాముండరాయ ద్వారా క్రీ.శ.983 ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణబెలగోల పట్టణానికి దగ్గర్లోని చంద్రగిరి కొండ మీద ఈ విగ్రహం నిర్మితమైంది. కొండమీద ఉండే ఈ విగ్రహాన్ని చేరేందుకు 618 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఏకశిలకు సంబంధించిన తెల్లటి గ్రానైట్‌ ద్వారా ఈ మహా విగ్రహం రూపొందించబడడంతో పాటు ఒక గొప్ప మత సంబంధమైన సంకేతంగాను ఈ విగ్రహం గుర్తింపును సాధించింది. జైనమతంలో మొదటగా మోక్షం పొందినది బాహుబలి అని జైనులు విశ్వసించడమే ఇందుకు కారణం. ఈ విగ్రహం ఒక తామరపుష్పంపై నిల్చి ఉంటుంది. తొడల ప్రాంతం వరకు ఈ విగ్రహానికి ఎలాంటి ఆధారం లేకపోవడంతో పాటు 60 ft m ల పొడవుతో ఉండే ఈ విగ్రహ ముఖం 6.5 ft m పరిమాణంలో ఉంటుంది. జైన ఆచారం ప్రకారం ఈ విగ్రహం పూర్తి నగ్నంగా ఉండడంతో పాటు దాదాపు 30 km దూరం నుంచి కూడా చక్కగా కనిపిస్తుంది.ఈ విగ్రహం పూర్తి ప్రశాంత వదనంతో కన్పించడంతో పాటు, దీని మనోహరమైన చూపులు, వంకీలు తిరిగిన జట్టు, చక్కటి శరీర సౌష్టవం, ఏకశిల పరిమాణం, కళానైపుణ్యం, హస్త నైపుణ్యాల మేలు కలయిక లాంటి అంశాల కారణంగా మధ్యయుగ కర్ణాటక[2] శిల్పకళకు సంబంధించి ఈ విగ్రహం ఒక విశిష్ట సాధనగా పేరు సాధించడంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్దదైన ఏకశిలా విగ్రహంగానూ పేరు సాధించింది[3]. గోమటేశ్వర విగ్రహం మాత్రమే కాకుండా, శ్రావణబెలగోలకు సంబంధించిన మిగిలిన ప్రదేశమంతా జైనమతానికి సంబంధించిన విగ్రహాలతోను, జైన తీర్థంకరులకు చెందిన అనేక విగ్రహాలతో నిండి ఉంటుంది. చంద్రగిరి కోట నుంచి చూస్తే చుట్టుపక్కల ప్రాంతం ఒక అందమైన దృశ్యంగా దర్శనమిస్తుంది. ప్రతి 12 సంవత్సరాలకోసారి వేలాదిమంది భక్తులు ఇక్కడికి చేరుకొని మహామస్టకాభిషేకం నిర్వహిస్తారు, బ్రహ్మాండమైన రీతిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా వేయి సంవత్సరాల పురాతనమైన గోమటేశ్వర విగ్రహాన్ని పాలు, పెరుగు, నెయ్యి, కుంకుమపువ్వు, బంగారు నాణేలతో అభిషేకిస్తారు. ఈ రకమైన అభిషేకం చివరిసారిగా 2006 ఫిబ్రవరిలో నిర్వహించారు, దీని తర్వాత 2018లో ఈ రకమైన అభిషేకాన్ని నిర్వహించనున్నారు.[4]. తరువాత అభిషేకం ఫిబ్రవరి 2018 లో జరుగుతుంది.[5]

2007 ఆగస్టు 5 న ఈ విగ్రహం 49% మొత్తం ఓట్లతో భారతదేశంలోని ఒక వింతగా ఎంపిక కాబడింది.[6]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  • Jaini, Jagmandar-lāl (1927). Gommatsara Jiva-kanda. మూలం నుండి 2006 న ఆర్కైవు చేసారు.
  • Rice, B. Lewis (1889). Inscriptions at Sravana Belgola: a chief seat of the Jains, (Archaeological Survey of Mysore). Bangalore : Mysore Govt. Central Press.
  • Zimmer, Heinrich (1953) [April 1952]. Campbell, Joseph (సంపాదకుడు.). Philosophies Of India. London, E.C. 4: Routledge & Kegan Paul Ltd. ISBN 978-81-208-0739-6.
  1. "Official website Hassan District". మూలం నుండి 2017-03-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2017-12-19. Cite web requires |website= (help)
  2. శేషాద్రి ఇన్ కామత్ (2001), పుట51
  3. Keay, John (2000). India: A History. New York: Grove Press. pp. 324 (across). ISBN 0802137970.
  4. "Mahamastabhishek". మూలం నుండి 2010-10-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2017-12-19. Cite web requires |website= (help)
  5. "Mahamastakabhisheka to be held in February 2018". The Hindu. Retrieved 2017-06-14.
  6. "And India's 7 wonders are..." The Times of India. August 5, 2007.

ఇతర లింకులు[మార్చు]