తోటపల్లి ఆనకట్ట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తోటపల్లి ఆనకట్ట
తోటపల్లి ఆనకట్ట is located in ఆంధ్రప్రదేశ్
తోటపల్లి ఆనకట్ట
ఆంధ్రప్రదేశ్ లో ఉనికి
అధికార నామంసర్దార్ గౌతు లచ్చన్న తో‌‌టపల్లి బ్యారేజి
Sardar Gouthu Latchanna Thotapalli Barrage
सर्दार् गौतु लच्चन्न तोटपल्लि बांध
ప్రదేశంతోటపల్లి (గరుగుబిల్లి).విజయనగరం జిల్లా
నిర్మాణం ప్రారంభం2003 సెప్టెంబరు 10
ప్రారంభ తేదీ2015 సెప్టెంబరు 10
నిర్మాణ వ్యయం775 కోట్ల రూపాయలు
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరునాగావళినది
Height20.20 మీటర్లు (66 అ.) from river level
పొడవు8,200 మీటర్లు (26,903 అ.)
Width (base)6 మీటర్లు (20 అ.)
జలాశయం
సృష్టించేదిసర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ఆనకట్ట
పరీవాహక ప్రాంతం4,455 చదరపు కిలోమీటర్లు (1,720 చ. మై.)

తోటపల్లి ఆనకట్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విజయనగరం జిల్లాకు చెందిన గరుగుబెల్లి మండలంలో ఉంది. ఈ ఆనకట్టకు భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు అయిన సర్దార్ గౌతు లచ్చన్న పేరిట నామకరణం చేసారు. ఈ ఆనకట్టను 2003 - 2015 మధ్య నిర్మించారు. ఈ ప్రాజెక్టు 2015 సెప్టెంబరు 10 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చే ప్రారంభించబడింది. ఈ ప్రాజెక్టు ద్వారా శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాలలోని 1,20,000 ఎకరాల వ్యవసాయానికి నీటిని అందించవచ్చు.[1]

1908 లో నాగావళి నదిపై తోటపల్లి రెగ్యులేటర్ నిర్మించబడింది. దీని ద్వారా 64,000 ఎకరాలకు నీరు అందించే సామర్థ్యం ఉండేది. ఈ రెగ్యులేటర్ స్థానంలో ప్రస్తుత ఆనకట్టను నిర్మించారు. ఈ ఆనకట్టకు 2.51 టి.ఎం.సి ల నీరు నిల్వచేసే సామర్థ్యం ఉంది. ఇది అదనంగా 56,000 ఎకరాలకు నీరు అందించే సామర్థ్యం కలిగి ఉంది.[2][3]

నేపథ్యం

[మార్చు]

తోటపల్లి ప్రాజెక్టుకు 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశాడు. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టును జలయజ్ఞంలో చేర్చి రూ. 450 కోట్లతో పూర్తి చేయాలని నిర్ణయించాడు. ఈ నిధులతో 2008 నాటికి ప్రాజెక్టును పూర్తిచేసి కొత్త ఆయకట్టుకు సాగునీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్ష్యానికి అనుగుణంగా పనులను పూర్తిచేయలేకపోయారు. సకాలంలో నిధులు మంజూరుకాకపోవడం, నిధులున్నా నిర్వాసితులు పనులను అడ్డుకోవడం, మరోపక్క ప్రకృతి వైపరీత్యాలతో డైవర్షన్‌ మట్టికట్టలు కొట్టుకుపోవడం, గుత్తేదారులు మధ్యలో పనులు నిలిపివేసి వెళ్లిపోవడం తదితర కారణాలతో పనులకు ఆటంకం కలిగింది. తోటపల్లి ప్రాజెక్టు పూర్తయితే మొత్తం 1.84 లక్షల ఎకరాలకు సాగునీరందే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు మొత్తం ఆయకట్టు 1.84 లక్షల ఎకరాలకు సాగునీరందించాలన్నది లక్ష్యం. కాగా ఇందులో పురాతన ఆనకట్ట పరిధిలోని ఆయకట్టు 64 వేల ఎకరాలు ఉంది. అంటే కొత్త ఆయకట్టు 1.20 లక్షల ఎకరాలు.[4]

తోటపల్లి పాత బ్యారేజీ

[మార్చు]

విజయనగరం జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన బ్యారేజీ నాగావళి నదిపై ఉన్న తోటపల్లి బ్యారేజీ.. ఒక్క విజయనగంలోనే కాకుండా ఉత్తరాంధ్రలోనే ఎంతో పేరు ప్రతిష్ఠలున్న బ్యారేజీ ఇప్పుడు కనుమరుగువుతోంది. పార్వతీపురానికి దగ్గరగా ఉన్న ఈ బ్యారేజీని అప్పటి బ్రిటీష్ వారు నిర్మించారు.. దీని ద్వారా పార్వతీపురం డివిజన్‌లోని 64వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ బ్యారేజీ నిర్మాణంతో పార్వతీపురం ప్రాంతమంతా సస్యశామలమైంది. ప్రతి ఏడాది రైతులు రెండు పంటలను పండించేవారు.. ఒడిశా రాష్ట్రానికి వెళ్లాలన్నా ఈ బ్రిడ్జే దిక్కు. అలాంటి బ్యారేజి ఇప్పుడు చరిత్ర పుటల్లో కలిసిపోనుంది. ఇంతవరకు బాగానే ఉన్న, ఎంతో చారిత్రిక నేపథ్యం ఉన్న పాత బ్రిడ్జిని కూల్చివేయడానికి అధికారులు సిద్ధపడ్డారు. దీనిపై అక్కడి రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.[5]

తోటపల్లి పాత బ్యారేజీకి వందేళ్ళకు పైగా చరిత్ర ఉంది. దీనిని పర్యాటక కేంద్రంగా గుర్తించాలని ఎ.పి. గిరిజన సంఘ ఉపాధ్యక్షులు కోలక లక్ష్మణమూర్తి డిమాండ్‌ చేశారు. 113 ఏళ్ల చరిత్రగల ఈ బ్యారేజి ఇంకా చెక్కు చెదరలేదని, గతంలో వరదల కారణంగా బ్యారేజీలో లక్షా 20వేలకు పైగా క్యూసెక్కులు వరద నీరు వచ్చినప్పటికీ ఈ ఆనకట్ట చెక్కు చెదరలేదనీ అతను తెలిపాడు. సుంకి, సంతోషపురం తదితర గ్రామాలకు చెందిన విద్యార్థులు తోటపల్లి జెడ్‌పి పాఠశాలల్లో చదువుకునేందుకు వస్తున్నారని, బ్యారేజీని కూల్చేస్తే సుమారు 10కిలోమీటర్లు మేర ఖడ్గవలస మీదుగా రావాల్సి ఉంటుందని అన్నారు. జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాలతో పాటు ఒడిషా ప్రాంతాలకు వెళ్లేవారు కూడా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.[6]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "India: National Register of Large Dams 2009". Thotapalli Project. Archived from the original on 12 సెప్టెంబరు 2015. Retrieved 11 September 2015.
  2. "Thotapalli Barrage Project". Archived from the original on 10 నవంబరు 2015. Retrieved 11 September 2015. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. "Thotapalli Irrigation Project JI00049". Archived from the original on 23 ఫిబ్రవరి 2016. Retrieved 11 September 2015.
  4. "మరో ఏడాది.. -". www.andhrajyothy.com. Retrieved 2018-05-21.[permanent dead link]
  5. "తోటపల్లి బ్యారేజీ". 10tv.in. Retrieved 2018-05-21.[permanent dead link]
  6. Stories, Prajasakti News. "తోటపల్లి పాత బ్యారేజీని కూల్చొద్దు". Prajasakti. Retrieved 2018-05-21.[permanent dead link]