లవ మందిరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లవ మందిరం, లాహోర్
లవకుశలతో శ్రీరాముడు
లవకుశలతో శ్రీరాముడు
ప్రదేశం
స్థానికం:లాహోర్ ఫోర్ట్
ప్రదేశం:లాహోర్, పంజాబ్
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :హిందూ దేవాలయం
ఇతిహాసం
నిర్వాహక సంస్థ:పాకిస్తాన్ హిందూ కౌన్సిల్
వెబ్ సైట్:http://www.pakistanhinducouncil.org/

లవ మందిరం హిందూ దేవత శ్రీరాముడు కుమారుడు అయిన ' లవుడు ' కు అంకితం చేసిన హిందూ ఆలయం.

పద చరిత్ర[మార్చు]

ఇది పాకిస్తాన్‌ లోని లాహోర్ ఫోర్ట్, లాహోర్ నందు ఉంది. ఈ నగరం లవుడు తదనంతరం అతని పేరు పెట్టబడింది. [1] లవ, కుశలు వారి తండ్రి శ్రీరామ తరువాత పాలకులుగా మారారు. వీరు లాహోర్ (లావాపురి అని పిలుస్తారు), కసూర్ నగరాలను స్థాపించారు. కోసల రాజు రాఘవ రామ రాజు శ్రావస్తి వద్ద తన కుమారుడు లవను, మరొక కుమారుడు కుశను కుశవతి వద్ద పరిపాలన కొరకు నియమించాడు. లాహోర్, షాహి ఖిల్లా లోపల లవ (లేదా లోహ్) తో సంబంధం కలిగిన ఒక ఆలయం ఉంది.

చరిత్ర[మార్చు]

పురాణాల ప్రకారం లాహోర్ నగరాన్ని 'లార్‌పోర్ ' అని పిలుస్తారు, ఇది శ్రీరాముడు కుమారుడైన లవ నుండి దీని మూలాన్ని సూచిస్తుంది. లాహోర్ నగరానికి సందర్శనకు వచ్చినప్పుడు, రాముడు, సీతల మంత్రముగ్దమైన ప్రేమ కథను విస్మరించలేరు. రాజపుత్రాదులు తమ పురాతన చరిత్రలో దీనికి ఇచ్చిన పేరు 'లోహ్ కోట్', అనగా దీని అర్ధం "లోహ్ యొక్క కోట", అంటే, పురాణ వ్యవస్థాపకుడు శ్రీరాముడు కుమారుడికి చెందినదని, మరోసారి సూచిస్తుంది. ప్రాచీన కాలంలో లవపురి (సంస్కృతంలో లవ నగరం) గా పిలువబడిన "లాహోర్", [2] ,[3], సీత, శ్రీరాముడు కుమారుడైన చక్రవర్తి ' లవ ' చేత స్థాపించబడింది. కసూర్ నగరం తన కవల సోదరుడు కుశ ద్వారా స్థాపించ బడింది. [4] ఈ రోజు వరకు, లాహోర్ ఫోర్ట్ లవకు అంకితం చేయబడి ఖాళీగా ఉన్న ఆలయం (లోహ్, అందుచేత లోహ్-అవర్ లేదా "ది ఫోర్ట్ ఆఫ్ లోహ్" అని కూడా పిలుస్తారు). [5] లాహోర్ గురించి పురాతన ప్రామాణిక పత్రం 982 సం.లో పేరులేకుండా వ్రాయబడింది. [6] దీనిని "హుదుడ్-ఇ-ఆలం "(ది రీజియన్స్ ఆఫ్ ది వరల్డ్) అని పిలుస్తారు. ఇది వ్లాదిమిర్ ఫెడోరోవిచ్ మైనర్స్కీచే 1927 సం.లో ఇంగ్లీషులోకి అనువదించబడి,లాహోర్‌లో ప్రచురించబడింది. ఈ పత్రంలో, లాహోర్ ఒక చిన్న షెహర్ (నగరం) గా పిలువబడుతూ, "అద్భుతమైన దేవాలయాలు, పెద్ద మార్కెట్లు, భారీ తోరణాలు" కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. అలగే, ఇది "రెండు నివాస స్థలాల చుట్టూ ఉన్న ప్రధాన మార్కెట్లను సూచిస్తుంది". ప్రస్తుతం అసలు పత్రం బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. [7] అన్ని చరిత్రకారుల జాబితాలలో, లాహోర్ ఉపఖండంలోని పురాతన నగరాలలో ఒకటిగా గుర్తించబడింది.

చరిత్ర మొత్తంలో లాహోర్‌ను వివిధ పేర్లతో పిలిచారు. ఈ రోజు వరకు ఇది ఎప్పుడు స్థాపించబడినది అనేది ఎటువంటి నిశ్చయమైన సాక్ష్యాలు, ఆధారాలు మాత్రం లేవు. కొందరు చరిత్రకారులు 4000 సంవత్సరాల క్రితం దీని నగర చరిత్రను గుర్తించారు. [8] అయితే చారిత్రాత్మకంగా, లాహోర్ నగరానికి కనీసం 2,000 సంవత్సరాల వయస్సు ఉన్నదని నిరూపించబడింది. లాహోర్ నగరం దక్షిణ ఆసియాకు ప్రధాన వాణిజ్యం, ముట్టడిచేసే మార్గాల్లో ఒకటి. ఈ నగరాన్ని అనేక రాజవంశాలు, సమూహాలు పాలించినాయి,దోచుకున్నాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. History of Lahore
  2. Bombay Historical Society (1946). Annual bibliography of Indian history and Indology, Volume 4. p. 257. Retrieved 2009-05-29.
  3. Baqir, Muhammad (1985). Lahore, past and present. B.R. Pub. Corp. pp. 19–20. Retrieved 2009-05-29.
  4. Nadiem, Ihsan N (2005). Punjab: land, history, people. Al-Faisal Nashran. p. 111. Retrieved 2009-05-29.
  5. Naqoosh, Lahore Number 1976
  6. HUDUD AL-'ALAM 'The Regions of the World' A Persian Geography Archived 2006-10-24 at the Wayback Machine
  7. Dawn Pakistan - The 'shroud' over Lahore's antiquity
  8. "Glasgow gets a new twin in Lahore". Living in Glasgow. 14 September 2006. Archived from the original on 28 February 2009. Retrieved 2009-07-06.
"https://te.wikipedia.org/w/index.php?title=లవ_మందిరం&oldid=2977563" నుండి వెలికితీశారు