అంతరిక్ష వ్యర్ధాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Merge-arrow.svg
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని అంతరిక్ష శిథిలాలు వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)

అంతరిక్ష వ్యర్ధాలు అంతరిక్షం లోకి ప్రయోగించే ఉపగ్రహాల ను, వ్యోమనౌకల ను, రాకెట్లకు సంబంధించిన పనికిరాని వస్తువులు, రాకెట్లు వదిలిపెట్టే విడిభాగాలు, కాలం చెల్లిన ఉపగ్రహాలు, నట్లు, బోల్టులు ఇవన్నీ అంతరిక్షంలో పేరుకుపోయి అంతరిక్ష వ్యర్ధాలుగా మిగిలిపోతాయి.[1]

విశేషాలు[మార్చు]

అంతరిక్షంలోకి ప్రయోగించే ఉపగ్రహాలు, వ్యోమనౌకలు, రాకెట్లకు సంబంధించిన పనికిరాని వస్తువులు, రాకెట్లు వదిలిపెట్టే విడిభాగాలు, కాలం చెల్లిన ఉపగ్రహాలు, నట్లు, బోల్టులు ఇవన్నీ అంతరిక్షంలో పేరుకుపోయి అంతరిక్ష వ్యర్ధాలుగా మిగిలిపోతాయి. వీటిలో కొన్ని చిన్నవిగా ఉండొచ్చు మరికొన్ని పెద్దవిగా ఉండొచ్చు. ఇవి అంతరిక్షంలో చాలా వేగంగా ప్రయాణిస్తుంటాయి. వీటి వేగం గంటకు 28వేల కిలోమీటర్లకు పైనే ఉంటుంది అంటే ఈ వేగం ధ్వని వేగం కన్నా 23 రెట్లు ఎక్కువ. 10 సెంటీమీటర్ల అల్యూమినియం ముక్క సెకనుకు 7.7 కిలోమీటర్ల వేగంతో ఢీకొంటే, 300 కిలోల టీఎన్‌టీ పేలుడు పదార్థం పేలినంత శక్తి వెలువడుతుంది. మరికొన్ని ఉపగ్రహాలైతే తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించే ప్రమాదం కూడా ఉంటుంది.[2]

నివారణ[మార్చు]

అంతరిక్షంలో చెత్తను తొలగించడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ చెత్తని భూమ్మీదికి తీసుకురావడం కష్టతరమైనది మరియు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి వాటిని అంతరిక్షంలోని నాశనం చేస్తారు. దీనికోసం స్పేస్‌ నెట్స్‌, సోలార్‌ సెయిల్స్‌, ఎలక్ట్రోడైనమిక్‌ టీతర్స్‌ విధానాలని ఉపయోగిస్తారు. ఈ పరికరాలు చేపల వలలా ఉంటాయి . చేపలకు వల వేసి విసిరినట్టుగా ఒకరకమైన ప్రత్యేకమైన వలతో అంతరిక్ష వ్యర్థాలను ఒడిసిపట్టుకుని అంతరిక్షంలో మండిచేస్తుంది. తలవెంట్రుకలో సగం మందంతో ఉండి అంతరిక్ష వ్యర్ధాలను తొలగిచేస్తుంది.

వ్యర్ధాల వివరాలు[మార్చు]

భూకక్ష్యలో సుమారు 17కోట్ల అంతరిక్ష వ్యర్థాల శకలాలు ఉన్నట్లు అంచనా. 10 సెంటీమీటర్లు, అంతకన్నా ఎక్కువ పెద్ద శకలాలు 20వేలకు పైగా. మరియు 1-10 సెంటీమీటర్ల శకలాలు 5 లక్షలకు అదేవిదంగా సెంటీమీటరు కన్నా చిన్న శకలాలు కోటికి పైగానే అంతరిక్షం లో విహరిస్తున్నాయి. అంతరిక్ష వ్యర్థాలు రాకెట్‌ ఉపరితల నిర్మాణాలు 17%గా, అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన వస్తువులు 19%గా, విఫలమైన ఉపగ్రహాలు 22%గా మరియు చిన్న చిన్న శకలాలు 42%గా భూకక్ష్య లో తిరుగుతున్నాయి.

భూకక్ష్య లోకి చేరిన ఉపగ్రహాలు[మార్చు]

  • 1979లో స్కైలాబ్‌ రాకెట్‌.
  • 2018లో తియాంగాంగ్‌-1.

మూలాలు[మార్చు]

  1. "పరమ చెత్త సవాల్‌!". ఈనాడు. www.eenadu.net. Retrieved 4 April 2018.
  2. "పరమ చెత్త". ఈనాడు. epaper.eenadu.net. Retrieved 4 April 2018.