Jump to content

స్వప్న బర్మన్

వికీపీడియా నుండి
స్వప్న బర్మన్
2017 లో ఒడిశాలో
Personal information
Born29 అక్టోబరు 1996[1]
జల్పైగురి, పశ్చిమ బెంగాల్, భారతదేశం
Sport
Country భారతదేశం
Sportఅథ్లెటిక్స్
Eventహెప్టాథ్లాన్
Achievements and titles
Personal best(s)6026 పాయింట్లు
(Jakarta 2018)
Medal record
Women's athletics
Representing  భారతదేశం
Asian Games
Gold medal – first place 2018 Jakarta Heptathlon
Asian Championships
Gold medal – first place 2017 Bhubaneswar Heptathlon
Federation cup
Gold medal – first place 2017 New Delhi Heptathlon
Updated on 29 ఆగస్టు 2018

స్వప్న బర్మన్ (జననం 29 అక్టోబరు 1996) భారతీయ హెప్టాథ్లెట్. ఆమె 2017లో జరిగిన ఆసియన్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్స్ లో హెప్టాథ్లాన్ విభాగంలో మొదటి స్థానం కైవశం చేసుకుంది. [1] ఆమె ‘రాహుల్‌ ద్రావిడ్‌ అథ్లెటిక్స్‌ మెంటార్‌షిప్‌ ప్రోగ్రాం’ కింద గో స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా శిక్షణ పొందుతోంది. ఆమె 2018లో ఇండోనేషియాలో జరిగిన ఆసియా క్రీడల్లో మహిళా హెప్టాథ్లాన్ విభాగంలో బంగారు పతకం పొందించి.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె పశ్చిమబెంగాల్ లోని జలపాయ్‌గురి పట్టణ సమీప ఘోసాపార అనే పల్లెటూరు లో 1996లో జన్మించింది. అసాధారణంగా ఆమె ఒక్కో కాలికి ఆరేసి వేళ్లుంటాయి.[2] తండ్రి పంచానన్‌ బర్మన్‌ రిక్షావాలా. తల్లి బసానా ఇంటింటా పనులు చేయడంతోపాటు తేయాకు తోటలో కూలీగా పని చేస్తోంది. 2013లో తన తండ్రి గుండెనొప్పితో మంచాన పడడంతో ఆమె కుటుంబం పరిస్థితి మరింత దైన్యంగా మారింది. సరైన ఆహారం తీసుకోవడానికోసం కష్టాలు పడింది. [1] ఆమె ఒక్కో కాలికి ఆరేసి వేళ్లుండటం వల్ల వాటికి తగ్గట్టుగా షూ లేకపోవడంతో సాధారణ ఆటగాళ్లు వేసుకొనే బూట్లనే ధరిస్తూ ఆమె ప్రాక్టీస్‌ చేస్తుంటుంది. ఆ బూట్లతో నొప్పిగా ఉన్నా ఆమె దానిని భరిస్తూ వస్తోంది.[2]

ఆమె గెలుచుకొన్న డబ్బును దారిద్ర్యంలో ఉన్న తన కుటుంబానికి వినియోగిస్తుంది.[3] 2016లో ఆమె అథ్లెటిక్స్ లో 150,000 ఉపకారవేతనాన్ని గెలుచుకుంది.[2] ఆమెప్రస్తుతం కోల్‌కతాలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందుతుంది. ఏషియన్‌ అథ్లెటిక్స్‌లో తన అత్యుత్తమం 5942 పాయింట్లతో స్వర్ణం నెగ్గిన ఆమె ఆసియా క్రీడల్లో వాటిని మరింత మెరుగుపరుచుకుని ఆరు వేల పాయింట్ల క్లబ్‌లో చేరింది.

విజయాలు

[మార్చు]

ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్

సంవత్సరం వేదిక క్రీడా విభాగం పాయింట్లు ఫలితం
2017 కళింగ స్టేడియం, భువనేశ్వర్ హెప్టాథ్లాన్ 5942 బంగారం

పాటియాలా ఫెడరల్ క్లబ్

సంవత్సరం వేదిక క్రీడా విభాగం పాయింట్లు ఫలితం
2017 జె.ఎల్.ఎన్. స్టేడియం , న్యూఢిల్లీ హెప్టాథ్లాన్ 5897 బంగారం

ఆసియా క్రీడలు

సంవత్సరం వేదిక క్రీడా విభాగం పాయింట్లు ఫలితం
2014 ఇంచెయాన్ ఆసియాడ్ మైన్ స్టేడియం హెప్టాథ్లాన్ 5178 5వ స్థానం
2018 గెలోరా బంగ్ కర్నో స్టేడియం హెప్టాథ్లాన్ 6026 బంగారం

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Could never afford nutritious food required by athlete, Asian gold-medallist Swapna Barman's father". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-07-11. Retrieved 2017-07-17.
  2. 2.0 2.1 2.2 "Swapna Barman Receives GSI Sports Scholarship - Company CSR | Largest CSR News Network - Social Responsibilities Give Better World". Company CSR | Largest CSR News Network (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-01-25. Retrieved 2017-07-17.
  3. "Swapna Barman on comeback wins gold, pledges for a job to run her ailing family". www.oneindia.com (in ఇంగ్లీష్). Retrieved 2017-07-17.