సదర్మాట్ ఆనకట్ట
సదర్మాట్ ఆనకట్ట | |
---|---|
![]() సదర్మాట్ ఆనకట్ట | |
స్థానం | మేడంపల్లి, ఖానాపూర్ మండలం, నిర్మల్ జిల్లా, తెలంగాణ |
సరస్సు రకం | జలాశయం |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
గరిష్ఠ పొడవు | 437.388 మీటర్లు |
సదర్మాట్ ఆనకట్ట తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మేడంపల్లి గ్రామ సమీపంలో గోదావరి నదిపై ఉంది. 437.388 మీటర్ల పొడవున్న ఈ ఆనకట్టను 1891-92లో నిజాం కా లంలో ఫ్రెంచ్ ఇంజనీర్ కేకే ఊట్లే ఆధ్వర్యంలో నైజాం తాలుక్ దార్ విల్‌కిన్‌సన్ దీనిని నిర్మించారు. దీనిని వారసత్వ సాగునీటి నిర్మాణ (హెచ్‌ఐఎస్) అవార్డుకు ఎంపికచేయడం జరిగింది.[1]
నిర్మాణం - సాగుబడి[మార్చు]
ఖానాపూర్‌కు ఏడు కిలోమీటర్ల దూరంలో గోదావరి నదిలో ఒక పొడగాటి ఆడ్డుగోడను నిర్మించి సదర్మాట్ కాల్వను ఏర్పాటుచేశారు. ఈ ఆనకట్ట నుంచి ఖానాపూర్, కడెం మండలాలకు చెందిన 26 గ్రామాల పరిధిలోని 13,100ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడం జరుగుతుంది. దీని పరిధిలో 80% వరి, మిగిలిన 20%లో మొక్కజొన్న, పసుపు పంటలు పండుతున్నాయి.
వారసత్వ సాగునీటి నిర్మాణంగా ఎంపిక[మార్చు]
కెనడాలోని సస్కటూన్‌లో 2018 ఆగష్టు 12నుండి 17వరకు జరిగిన 69వ ఐఈసీ సమావేశంలో తెలంగాణ నీటిపారుదలశాఖ పంపిన ప్రతిపాదనల్ని పరిశీలించి సదర్మాట్ ఆనకట్టను వారసత్వ సాగునీటి నిర్మాణంగా ఎంపికచేశారు.[2]
బ్యారేజీ నిర్మాణం[మార్చు]
మామడ మండలం పొంకల్ వద్ద రూ.516.23 కోట్లతో సదర్మాట్ బ్యారేజీ నిర్మాణం జరుగుతుంది. సదర్మాట్ ఆయకట్టు 6848 ఎకరాలతో పాటు కొత్తగా 5618 ఎకరాలు మొత్తం ఖానాపూర్ నియోజకవర్గంలో 12466 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాలకు తాగునీరు అందనుంది.[3]
మూలాలు[మార్చు]
- ↑ నమస్తే తెలంగాణ (10 September 2018). "చెక్కుచెదరని నిర్మాణం.. సదర్మాట్". Archived from the original on 10 September 2018. Retrieved 10 September 2018. CS1 maint: discouraged parameter (link)
- ↑ నమస్తే తెలంగాణ (10 September 2018). "సదర్‌మాట్, కామారెడ్డి పెద్దచెరువు వారసత్వ నిర్మాణాలు". Archived from the original on 10 September 2018. Retrieved 10 September 2018. CS1 maint: discouraged parameter (link)
- ↑ నమస్తే తెలంగాణ (23 November 2017). "సదర్మాట్ ఆయకట్టుకు మళ్లీ ప్రాణం". Archived from the original on 10 September 2018. Retrieved 10 September 2018. CS1 maint: discouraged parameter (link)