శ్రీరాంసాగర్ వరద కాలువ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీరాంసాగర్ వరద కాలువ (శ్రీరాంసాగర్ వరద కాలువ)
SRSP flood flow canal
దేశం India
Source శ్రీరాం సాగర్ రిజర్వాయరు
 - ఎత్తు 326 m (1,070 ft)
Mouth మధ్య మానేరు రిజర్వాయరు
పొడవు 130 km (81 mi)
Discharge for శ్రీరాం సాగర్ రిజర్వాయరు
 - సరాసరి 623 m3/s (22,001 cu ft/s)

శ్రీరాం సాగర్ వరద కాలువ (SRSP Flood Flow Canal) శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుండి 130 కి.మీ పొడవు గల కాలువ. ఇది తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాదు జిల్లా లోని సంగం గ్రామంనుండి కరీం నగర్ జిల్లాలోని మన్వాడ గ్రామంలో గల మధ్య మానేరు ఆనకట్ట వరకు ఉంది. [1][2]

చరిత్ర[మార్చు]

ఈ కాలువ శ్రీరాం సాగర్ రెండవ దశలో భాగం. దీనికి 1991లో అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహరావు శంకుస్థాపన చేసాడు. ఈ కాలువ శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో అధికంగా ఉన్న నీటి వనరులను మధ్య మానేరు ఆనకట్టకు తరలిస్తుంది. దీని ఫలితంగా అదనంగా 25 టి.ఎం.సి అడుగుల నీటిని మధ్య మానేరు ఆనకట్టకు వస్తుంది. కరీంనగర్ జిల్లాలోని దిగువ మానేరు డ్యాం కూడా నిండటానికి ఉపయోగపడుతుంది.

ఈ కాలువ నిర్మాణం జూలై 2010 లో పూర్తి చేయబడి ఆగస్టు 2010 లో ప్రారంభించబడినది. ఈ కాలువ ప్రస్తుతం మధ్య మానేరు డ్యాం నిర్మాణంలో ఉన్నందున దిగువ మానేరు డ్యాం లో నీటిని నింపుటకు ఉపయోగపడుతుంది.[3] ఈ కాలువ 22000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయుటకు రూపొందించబడినది. ఇది మధ్య మానేరు డ్యాం (26 tmcft), దిగువ మానేరు డ్యాం (24 tmcft) లకు మొత్తం 50 tmcft నీటిని అందుస్తుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "FFC from SRSP (Indiramma Flood Flow canal) JI00233". మూలం నుండి 13 ఆగస్టు 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 19 July 2015. Cite web requires |website= (help)
  2. "SRSP flood flow canal". మూలం నుండి 29 ఆగస్టు 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 19 జులై 2015. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)
  3. "Water released into FFC". Retrieved 19 July 2015. Cite web requires |website= (help)