మధ్య మానేరు డ్యామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మధ్య మానేరు డ్యామ్
Mid Maneru Dam.jpg
మధ్య మానేరు డ్యామ్
Mid Manair Dam
అధికార నామం(రాజరాజేశ్వర జలాశయం) మధ్య మానేరు డ్యామ్
Mid Manair Dam
ప్రదేశంమన్వాడ గ్రామం, బోయినపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ, భారతదేశం
అక్షాంశ,రేఖాంశాలు18°23′34″N 78°57′40″E / 18.39278°N 78.96111°E / 18.39278; 78.96111Coordinates: 18°23′34″N 78°57′40″E / 18.39278°N 78.96111°E / 18.39278; 78.96111
స్థితిపూర్తి
నిర్మాణం ప్రారంభం2005
ప్రారంభ తేదీ2018
నిర్మాణ వ్యయంరూ.2,150 కోట్లు
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుమానేరు నది, శ్రీరాంసాగర్ వరద కాలువ
ఎత్తు45 మీటర్లు (148 అడుగులు)
పొడవు388 మీటర్లు (1,273 అడుగులు)[1]
జలాశయం
సృష్టించేదిమధ్య మానేరు డ్యామ్
మొత్తం సామర్థ్యం25.873 Tmcft
క్రియాశీల సామర్థ్యం3.00 Tmcft

మధ్య మానేరు డ్యామ్ తెలంగాణ రాష్ట్రం లోని రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపల్లి మండలం మన్వాడ గ్రామంలో మానేరు నదిపై నిర్మించబడిన జలాశయం. ఇది 2,00,000 హెక్టార్లకు సాగు నీటిని అందించడమేకాకుండా, మత్స్య పరిశ్రమకు, త్రాగునీటి సరఫరా వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది. 2005లో మొదలైన ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు 2018, ఏప్రిల్ 4 నాటికి పూర్తై 25 టీఎంసీల నీటిని నిల్వచేసేలా నిర్మించబడింది.[2][3]

చరిత్ర[మార్చు]

1991లో మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు చేత శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండవ దశలో భాగంగా జలాశయం ప్రారంభించబడింది. మానేరు నది నుండి కాకుండా శ్రీరాంసాగర్ వరద కాలువ ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి మిగులు నీరు ప్రవహిస్తుంది. ఆనకట్ట పూర్తి సామర్థ్యాన్ని చేరుకున్న తర్వాత, కరీంనగర్ నగరంలోని 24 అడుగుల స్థూల సామర్థ్యం కలిగిన దిగువ మానేరు డ్యామ్ లోకి నీరు విడుదల చేయబడుతుంది.

2004-05లో జలయజ్ఞంలో భాగంగా మొదలైన ఈ ఆనకట్ట నిర్మాణం, అనేక రాజకీయ కారణాల మధ్యలో ఆగిపోయింది. 2005లో ప్రారంభమైన ప్రాజెక్టు పదేళ్లలో 50 శాతం పూర్తయితే, తెలంగాణ ప్రభుత్వం 10 నెలల్లోనే మిగతా 50శాతం పనులు పూర్తి చేసింది.[4] ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి తుది ఖర్చు రూ. 2,150 కోట్లు.

జలాశయం వివరాలు[మార్చు]

ఈ జలాశయం యొక్క స్థూల సామర్ధ్యం 25.873 Tmcft. 21 కిలోమీటర్లు పొడవున్న ఎడమ కాలువ 9,500 ఎకరాలకు సాగునీరందించగా, 64 కిలోమీటర్లు ఉన్న కుడికాలువ 90,500 ఎకరాలకు సాగునీరందిస్తుంది.

మూలాలు[మార్చు]

  1. "India: National Register of Large Dams 2012" (PDF). Central Water Commission. Retrieved 8 July 2018. Cite web requires |website= (help)
  2. నమస్తే తెలంగాణ (5 April 2018). "మిడ్‌మానేరు సక్సెస్". మూలం నుండి 8 July 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 8 July 2018. Cite news requires |newspaper= (help)
  3. ఆంధ్రప్రభ, ముఖ్యాంశాలు (4 April 2018). "మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులు పూర్తి కావడంపట్ల మంత్రి హరీశ్‌రావు హర్షం". మూలం నుండి 8 July 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 8 July 2018. Cite news requires |newspaper= (help)
  4. నవతెలంగాణ (4 April 2018). "మిడ్‌మానేరు ప్రాజెక్టు పూర్తి చేసి రికార్డు తిరగరాసిన తెలంగాణ ప్రభుత్వం". మూలం నుండి 8 July 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 8 July 2018. Cite news requires |newspaper= (help)