Coordinates: 18°59′27.9852″N 78°34′16.0104″E / 18.991107000°N 78.571114000°E / 18.991107000; 78.571114000

సదర్మాట్ బ్యారేజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సదర్మాట్ బ్యారేజీ
సదర్మాట్ బ్యారేజీ is located in Telangana
సదర్మాట్ బ్యారేజీ
పొన్కల్ వద్ద సదర్మాట్ బ్యారేజీ
సదర్మాట్ బ్యారేజీ is located in India
సదర్మాట్ బ్యారేజీ
సదర్మాట్ బ్యారేజీ (India)
అధికార నామంసదర్మాట్ బ్యారేజీ
దేశంభారతదేశం
ప్రదేశంపొంకల్, మామడ మండలం, నిర్మల్ జిల్లా, తెలంగాణ
అక్షాంశ,రేఖాంశాలు18°59′27.9852″N 78°34′16.0104″E / 18.991107000°N 78.571114000°E / 18.991107000; 78.571114000
ఆవశ్యకతనీటి పారుదల
స్థితినిర్మాణంలో ఉంది
నిర్మాణం ప్రారంభం2021 జనవరి 11
నిర్మాణ వ్యయం520 కోట్లు
యజమానిభృందా ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ & సిరి కన్‌స్ట్రక్షన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (జాయింట్ వెంచర్)
యజమానితెలంగాణ ప్రభుత్వం
నిర్వాహకులుతెలంగాణ నీటి పారుదల శాఖ
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంబ్యారేజీ
నిర్మించిన జలవనరుగోదావరి నది
Spillways55 గేట్లు
జలాశయం
సృష్టించేదిసదర్మాట్ జలాశయం
మొత్తం సామర్థ్యం1.6 టిఎంసీ

సదర్మాట్ బ్యారేజీ[1][2][3] అనేది తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, మామడ మండలం, పొంకల్ గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న బ్యారేజీ. ఇది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి 32 కి.మీ.ల దిగువన, సదర్మాట్ అనకట్ట నుండి 7 కి.మీ.ల ఎగువన ఉంది. 520 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబడుతున్న ఈ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో 20,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తుంది.

చరిత్ర[మార్చు]

1891-92లో నిజాం కాలంలో నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మండలం, మేడంపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మించబడిన సదర్మాట్ అనకట్టలో తగిన నీటి నిల్వ లేదు. వ్యవసాయ భూములకు సాగునీరు అందడానికి గోదావరి నది ఎగువ ప్రాంతాల నుండి ప్రవాహాలు అవసరం. అందుకోసం 1.6 టీఎంసీల నీటి నిల్వతో ఈ సదర్మాట్ బ్యారేజీ నిర్మించబడుతోంది. నిర్మల్ జిల్లాలోని అదనపు 20,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించడంతోపాటు సదర్మాట్ అనకట్ట కింద ఇప్పటికే ఉన్న 18,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరిస్తుంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పునరుజ్జీవన పథకంలో భాగంగా,[4] మూడు హౌస్ పంపులు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నుండి 60 టిఎంసీల నీటిని ఎత్తిపోస్తూ శ్రీరాంసాగర్ వరద కాలువ ద్వారా 69 రోజుల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను నింపుతాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుండి నీరు ప్రాజెక్ట్ దిగువన ఉన్నందున గ్రావిటీ ద్వారా సదర్మాట్ బ్యారేజీకి, సదర్మాట్ ఆనకట్టకు విడుదల చేయవచ్చు. ఇది గోదావరి ఎగువ ప్రాంతాలలో కరువు కాలంలో కూడా సదర్మాట్ బ్యారేజీకి, సదర్మాట్ ఆనకట్టకు నీటి సరఫరాను అందిస్తుంది.

ప్రాజెక్టు వివరాలు[మార్చు]

  • బ్యారేజీ పొడవు: 987 మీటర్లు
  • నీటి నిల్వ సామర్ధ్యం: 1.58 టీఎంసీలు
  • బ్యారేజీ వరద గేట్లు: 55
  • కట్ట పొడవు: 750 మీటర్లు (పొంకల్ వైపు, నిర్మల్)
  • కట్ట పొడవు: 850 మీటర్లు (మూల రాంపూర్ వైపు, జగిత్యాల జిల్లా)

శంకుస్థాపన[మార్చు]

520 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబడుతున్న ఈ బ్యారేజీకి 2021 జనవరి 11న తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు ఈ బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాదు ఎంపీ గోదాం న‌గేశ్కోరుట్లఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావుఖానాపూర్ ఎమ్మెల్యే ఆజ్మీరా రేఖ నాయక్, ముథోల్‌ ఎమ్మెల్యే జి. విఠల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఇలంబర్తి పాల్గొన్నారు.[5]

నిధులు[మార్చు]

దీని నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి 516.233 కోట్ల రూపాయల పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చి నిధులు కేటాయిందింది. గత ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, డీపీఆర్‌, ఇంజనీరింగ్‌ పనులకు 328 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది, ఇందులో 40 కోట్ల రూపాయల వ్యాట్‌, జీఎస్‌టీ, లేబర్‌ సెస్‌లకు కేటాయించినప్పటికీ కేంద్రం నుంచి ఒక్కరూపాయి కూడా ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక ససహాయం అందలేదు.[6]

భూసేకరణ[మార్చు]

ప్రాజెక్ట్‌ నిర్మాణంలో మామడ మండలంలోని పొన్కల్, ఆదర్శనగర్, కమల్‌కోట్‌ గ్రామాలకు చెందిన 1200 ఎకరాల వ్యవసాయ భూములు, జగిత్యాల జిల్లాలోని మూలరాంపూర్‌ గ్రామానికి చెందిన 400 ఎకరాల వ్యవసాయ భూముల కోసం జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం డీపీఆర్‌ సమర్పించింది. బ్యారేజీ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ.8.50 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు అందించేందుకు అధికారులు గ్రామసభలను నిర్వహించి భూముల ధరలను నిర్ణయించి నివేదికలు పంపించారు.

మూలాలు[మార్చు]

  1. "Govt Moots Sadarmat Mini-barrage in A'bad". The New Indian Express. Retrieved 2023-05-18.
  2. India, The Hans (2019-12-24). "Speed up Sadarmat barrage works: CMO Secretary Smitha Sabharwal". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-05-18.
  3. "Implementation of Sadarmatt barrage scheme in Adilabad district - PPP in India". Department of Economic Affairs, Ministry of Finance, Government of India. Archived from the original on 2023-05-17. Retrieved 2023-05-18.
  4. M, Shyam Kumar. "SRSP rejuvenation works on track". Telangana Today. Retrieved 2023-05-18.
  5. "సదర్‌మాట్‌కు అడ్డుపడుతారేమో... తరిమికొట్టండి". Sakshi. 2017-01-12. Archived from the original on 2017-09-17. Retrieved 2023-05-18.
  6. "ఆదివాసి, గిరిజన తండాలకు కాళేశ్వరం జలాలు." Prabha News. 2023-02-15. Archived from the original on 2023-02-15. Retrieved 2023-05-18.