అక్షాంశ రేఖాంశాలు: 33°22′09″N 75°47′54″E / 33.3692°N 75.7984°E / 33.3692; 75.7984

దుల్ హస్తి జలవిద్యుత్కేంద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దుల్‌హస్తి జలవిద్యుత్కేంద్రం
దుల్ హస్తి జలవిద్యుత్కేంద్రం is located in Jammu and Kashmir
దుల్ హస్తి జలవిద్యుత్కేంద్రం
Jammu and Kashmir లో దుల్‌హస్తి జలవిద్యుత్కేంద్రం స్థానం
దేశంభారతదేశం
ప్రదేశంకిష్ట్‌వార్, జమ్మూ కాశ్మీరు
అక్షాంశ,రేఖాంశాలు33°22′09″N 75°47′54″E / 33.3692°N 75.7984°E / 33.3692; 75.7984
ఆవశ్యకతవిద్యుత్తు
స్థితిOperational
నిర్మాణం ప్రారంభం1985
ప్రారంభ తేదీ2007; 17 సంవత్సరాల క్రితం (2007)
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంగ్రావిటీ
నిర్మించిన జలవనరుచీనాబ్ నది
Height70 మీ. (230 అ.)
పొడవు190 మీ. (620 అ.)
Elevation at crest1,250 మీటర్లు (4,100 అ.)
Spillway capacity8,000 m3/s (280,000 cu ft/s)
దుల్‌హస్తి జలవిద్యుత్కేంద్రం
Coordinates33°17′13″N 75°45′44″E / 33.2869°N 75.7621°E / 33.2869; 75.7621
Commission date2007
హైడ్రాలిక్ హెడ్200 మీటర్లు (660 అ.)
టర్బైన్లు3 x 130 మెగావాట్లు ఫ్రాన్సిస్
Installed capacity390 MW

దుల్ హస్తి అనేది జమ్మూ కాశ్మీర్‌ కిష్త్వార్ జిల్లాలో ఎన్‌హెచ్‌పిసి నిర్మించిన 390 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం. ఈ విద్యుత్కేంద్రం హిమాలయ పర్వత ప్రాంతంలో, జమ్మూ డివిజన్‌లోని పెద్ద నగరాల నుండి అనేక వందల కిలోమీటర్ల దూరంలో, చీనాబ్ నదిపై ఉంది. ఇది రన్-ఆఫ్-ది-రివర్ రకం విద్యుత్కేంద్రం.[a] 70 మీ. (230 అ.) పొడవైన ఆనకట్ట నుండి 9.5 కి.మీ. (5.9 మై.) పొడవున్న హెడ్‌రేస్ సొరంగం ద్వారా నీటిని మళ్లించి విద్యుదుత్పత్తి చేస్తారు. ఈ నీరు తిరిగి చీనాబ్‌లోకి విడుదల అవుతుంది. ఈ ప్రాజెక్టు జమ్మూ, కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్ విద్యుత్తును అందిస్తుంది. ఈ ప్రాజెక్టును 1985, 2007 మధ్య నిర్మించారు.[1]

డిజైన్

[మార్చు]

దుల్ హస్తి హైడ్రో-ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (HEP) కిష్త్వార్ పరిసరాల్లో, చీనాబ్ నదిలో వచ్చే ఒక వంపు వద్ద ఉంది. ఆనకట్ట నుండి సొరంగం ద్వారా జలవిద్యుత్కేంద్రానికి నీళ్ళు వెళ్తాయి. ఆనకట్ట దుల్ గ్రామం వద్ద, విద్యుత్కేంద్రం హస్తి గ్రామం వద్ద ఉండడంతో ఈ ప్రాజెక్టుకు "దుల్ హస్తి" అనే పేరు వచ్చింది. దుల్, హస్తిల మధ్య ఎత్తులో ఉన్న 200 మీటర్ల తేడా, విద్యుదుత్పత్తికి అవసరమైన హైడ్రాలిక్ హెడ్‌ను ఇస్తుంది.

ఆనకట్ట ఎత్తు 65 మీటర్లు, పొడవు 186 మీటర్లు.[2] దీని స్పిల్‌వేలకు, మేట వేసిన మట్టిని తొలగించే వీలున్న తక్కువ-ఎత్తు గేట్లు పెట్టారు.[3][4] [b]

నేపథ్యం

[మార్చు]

1985లో ప్రారంభమైన దుల్‌హస్తి విద్యుత్ ప్రాజెక్టు, జమ్మూ కాశ్మీర్‌లో నిర్మించారు. ఈ ప్రాజెక్టు వ్యయం అంచనాలకూ, వాస్తవాలకూ ఉండే విపరీత వ్యత్యాసానికి ఒక విపత్తుకు ఉదాహరణ. మొదట్లో, ప్రాజెక్టు వ్యయం 1600 కోట్లుగా అంచనా వేసారు. కాంట్రాక్టు ఇచ్చే సమయానికి వ్యయ అంచనా 4500 కోట్లైంది. ఆ తరువాత వరుసగా 800, 1100, 1600, 2400 కోట్ల రూపాయల చొప్పున పెరిగింది. మొత్తమ్మీద ప్రాజెక్టు 2007 ఏప్రిల్ 7 న మొదలై, సంవత్సరానికి 2000 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది.[6][7][2]

కాంట్రాక్టు, డిజైను

[మార్చు]

విద్యుదుత్పత్తి ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్టును మొదటగా $5 కోట్లకు ఫ్రెంచ్ కన్సార్టియమ్‌కు ఇచ్చారు. వెంటనే ఆ కన్సార్టియమ్ ధరలను సవరించాలని కోరింది. దుల్‌హస్తి స్థాయి జలవిద్యుత్ కేంద్రాన్ని నడపడానికి అవసరమైన నీరు అందుబాటులో ఉన్న నదీ వ్యవస్థలు సమీపంలో ఉండడంతో ఆ నీటిని ఉపయోగించుకోవడానికి ఈ ప్రాజెక్టును ఉద్దేశించారు. దురదృష్టవశాత్తు, ప్రాజెక్టు కోసం ఎంచుకున్న స్థలానికి కొన్ని తీవ్రమైన లోపాలు కూడా ఉన్నాయి. మొదట, ఇది భారత పాకిస్తాన్ల మధ్య వివాదాస్పదంగా ఉన్న సరిహద్దు ప్రాంతంలో ఉంది. జమ్మూ కాశ్మీర్ స్వాతంత్ర్యం కోరే వేర్పాటువాద శక్తులు, భారత సైన్యం మధ్య తీవ్రమైన ఘర్షణలకు కేంద్రం. వివాదాస్పద ప్రాంతంలో నిర్మించే విద్యుత్కేంద్రం వంటి ప్రాజెక్టును ఉగ్రవాద గ్రూపులు తమ ప్రధాన ప్రతిపక్ష సాధనంగా ఉపయోగించుకుంది. అందువల్ల, ఈ స్థలానికి భద్రత కల్పించడం ఖర్చుతో కూడుకున్నదిగా మారింది.

రెండవ సమస్య, తగినంత రోడ్లు, రైలు మార్గాలు, తదితర మౌలిక సదుపాయాలు సరిగా లేని ప్రాంతం కావడం. హిమాలయాల దిగువ ప్రాంతంలో ప్లాంట్‌ను నిర్మించడం ఖర్చుతో కూడుకున్నది. దాదాపు అన్ని సామాగ్రిని వాయు రవాణాతో, అధిక ఖర్చులతో తీసుకురావలసి ఉంటుంది. సిమెంట్, కలప, రాయి, ఉక్కుతో సహా అన్ని ముడి పదార్థాలను హెలికాప్టర్‌లో హిమపాతం ఉన్న ప్రాంతాలపైకి మైళ్ల దూరం తీసుకెళ్లాలి.

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • రాటిల్ జలవిద్యుత్ ప్లాంట్ - దిగువకు నిర్మాణంలో ఉంది

గమనికలు

[మార్చు]
  1. ఆనకట్ట ఉన్నప్పటికీ జలాశయం అసలే లేని, లేదా చాలా కొద్దిపాటి నిల్వ సామర్థ్యం ఉండే జలాశయాలపై ఆధారపడి నిర్మించే విద్యుదుత్పత్తి కేంద్రాలను రన్-ఆఫ్-ది-రివర్ రకం విద్యుత్కేంద్రాలంటారు. నదిలో ప్రవహించే నీటిపై ఆధారపడి మాత్రమే ఇవి పనిచేస్తాయి.
  2. The elimination of low-level spillways at the earlier Salal Dam has caused silt to build up, damaging the sustainability of the that project. Pakistan does not appear to have objected to the gated spillways at Dul Hasti.[5]

మూలాలు

[మార్చు]
  1. "Dul Hasti dam and Hydroelectric Power Project". Tractebel. Archived from the original on 25 November 2012. Retrieved 15 June 2013.
  2. 2.0 2.1 "Dulhasti". NHPC Limited. Retrieved 6 June 2021. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "NHPC 2021" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. The Big Brother, Kashmir Life, 23 June 2012.
  4. Annual Report 2006–07, Ministry of Power, 2007, p. 7.
  5. Dar, Power Projects in Jammu & Kashmir (2012), p. 18.
  6. Dar, Power Projects in Jammu & Kashmir (2012).
  7. "Welcome to Dulhasti Power Station". NHPC Limited. Archived from the original on 27 November 2010.