వికీపీడియా చర్చ:మీకు తెలుసా? భండారము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేదాలు తెలుగు భాష మీద చర్చ[మార్చు]

.... ప్రాంతీయ భాషల్లో నాలుగు వేదాలు కలిగి ఉన్నది ఒక్క తెలుగు మాత్రమే. ఋజువు కావాలి. --మాటలబాబు 22:53, 19 ఆగష్టు 2007 (UTC)
తెలుగు లిపి లో నాలుగు వేదాలు ప్రచురింపబడ్డాయి కాని మిగిలిన భాషల లిపులలో ప్రచురింపబడలేదు అని పైవాక్యానికి అర్థమా? లేక వేదాలు తెలుగు లోకి మాత్రమే అనువదించబడ్డాయి కాని ఇతర భారతీయ భాషల లోకి అనువదించబడలేదు అని అర్థమా? మొదటిదానికి కాదు అనే నా అభిప్రాయం, ఋజువుకోసం వెతుకుతాను; రెండవ దాని విషయం నాకు తెలియదు.----కంపశాస్త్రి 02:31, 20 ఆగష్టు 2007 (UTC)
నాలుగు వేదాలను తెలుగులోనికి అనువదించిన దాశరథి రంగాచార్య చెప్పిన దాని ప్రకారం తెలుగు లోమాత్రమే నాలుగు వేదాలకు అనువాదాలు ఉన్నాయి.----కంపశాస్త్రి 04:11, 20 ఆగష్టు 2007 (UTC)
పరిశోధించిన శాస్త్రి గారి కి ధన్యవాదాలు ఆ లింకు శాస్త్రి గారి పరిశోధన సౌజన్యంతో ఈనాడు పేపరు నుండి--మాటలబాబు 04:16, 20 ఆగష్టు 2007 (UTC)
పరిశోధించి వివరించిన కంపశాస్త్రి గారికి కృతజ్ఞతలు. మీరు తెవికీలో చేస్తున్న కృషి అభినందనీయం --వైజాసత్య 04:36, 20 ఆగష్టు 2007 (UTC)

తరలింపు[మార్చు]

ఈ పేజీ 32kb సైజు దాటుతుండడంతో మీకు తెలుసా? (పాతవి) సృష్టించి ఐదు వారాలకంటే మునుపటివి ఆ పేజీకి తరలించాను.--Svrangarao 22:58, 23 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

భండారము[మార్చు]

  • విషయము: "మీకు తెలుసా? భండారము (విభాగం)" అని వ్రాశారు. భండారము బదులు భాండాగారము అని ఉంటే సరి పోతుందేమో ?

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:30, 23 డిసెంబర్ 2011 (UTC)

భండారము, భాండాగారము అనేదానికి ఆంధ్రభారతి నిఘంటువు శోధన లోని మూడు నిఘంటువులలో పరిశీలించాను. భాండాగారము నకు శంకరనారయణ తెలుగు - ఇంగ్లీషు నిఘంటువులో మాత్రమే a treasury, a store-house or store-room, a place where household goods are kept. అని ఇచ్ఛారు. తెలుగు పదం మెయిల్ జాబితా లో చర్చించి నిర్ణయానికి వస్తే బాగుంటుందేమో. -- అర్జున 04:44, 24 డిసెంబర్ 2011 (UTC)
తప్పకుండా చర్చించండి. భండారము అంటే ధనాగారానికి వాడతారు. అంటే బొక్కసము. భండాగారము/భాండాగారము ఆంటే లైబ్రరీ అని అర్ధం వస్తుంది. అందరూ అలోచించండి.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:54, 9 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

భాండాగారము నకు ధనాగారముకూడా వుంది పైన చెప్పిన వుదాహరణ ప్రకారం. అయిన ధనేతర విషయాలకు భాండాగారము బాగుంటుందనిపిస్తుంది. ఒక వారం లో వేరే అభిప్రాయాలు చర్చలోకి రాకపోతే మార్చేద్దాం. --అర్జున 05:24, 9 జనవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

మీకు తెలుసా? వాక్యాలు[మార్చు]

మొదటిపేజీలో ప్రదర్శించే మీకు తెలుసా? శీర్షిక లోని వాక్యాలను పరిశీలించాను. ఆ శీర్షికలో పెట్టాల్సిన వాక్యాలు ఆహా! అనిపించేవిధంగా సంక్షిప్తంగా, మధురంగా ఉంటూ తెలుసుకొనవిధంగా ఉండాలి. కాని ఇటీవలి మీకుతెలుసా? వాక్యాలలో ఆహా! అనిపించే విధంగా కాకుండా వ్యాసప్రచారానికి సరిపోయేవిధంగానే ఉన్నాయి. ఈ శీర్షికలో కొత్త వ్యాసాలలోని ముఖ్యమైన, అత్భుతమైన వాక్యాలనే తీసుకొని శీర్షికనిర్వహిస్తే బాగుంటుంది. వ్యాసప్రచారానికి చెందిన వాక్యాలు కూడా చాలా పెద్దవిగా ఉండుటవల్ల మొదటిపేజీలో శీర్షిక పొడవు కూడా పెరిగింది. ఇదివరకు చాలాకాలం పాటు నేను ఈ శీర్షిక నిర్వహించాను వాటిలో కొన్ని చూడండి సి. చంద్ర కాంత రావు- చర్చ 15:55, 29 సెప్టెంబర్ 2013 (UTC)

చంద్రకాంతరావు గారూ అన్నీ ఒకే శైలిలోనే ఉండాలా లేకుంటే కొన్ని ఫలానా మంది ఒకేసారి గుండ్లకమ్మ తీరంలో క్రైస్తవమతాన్ని ఎందుకు స్వీకరించారో తెలుసా? అంటూ ప్రశ్నించేవిధంగా ఉండవచ్చా? అలా ఐతే మరింత ఆసక్తికరంగా ఉంటుంది కదా? పైగా పొడవు కూడా తగ్గుతుంది కదా విషయం కొంతవరకూ సమాధానంలోకి(వాళ్ళే వెతుక్కోవాలి) వెళ్ళిపోవడం వల్ల. ఉదాహరణ కోసం అలాంటిది ఒకటి 26వ వారంలో వ్రాస్తున్నాను పరిశీలించి చూడండి. ఒకవేళ ఇది అంగీకారయోగ్యం కాదనుకుంటే దాన్ని చిన్నగా శైలిమార్పు చేసి వదిలేయవచ్చు.--పవన్ సంతోష్ (చర్చ) 14:38, 5 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త వ్యాసాల నుండే ఈ శీర్షికకు వాక్యాలను స్వీకరించాలా?[మార్చు]

ఈ శీర్షికలో వ్రాయడానికి కొత్త వ్యాసాలనే పరిశీలించాలా? లేక పాతవ్యాసాలలో కొత్తగా చేసిన మార్పులను కూడా పరిగణించవచ్చా? నిర్వాహకులు దయచేసి తెలుపగలరు. ఉదాహరణకు 15వ వారం భండారంలో నేను పూసపాటి విజయానంద గజపతి రాజు వ్యాసానికి చెందిన ఒక వాక్యాన్ని చేర్చాను. అయితే ఆ వ్యాసం 2010లో మొదలైంది. కాని నేను చేర్చిన వాక్యం ఇటీవలే ఆ వ్యాసానికి చేర్చబడింది. ఇది నియమోల్లంఘన క్రిందకు వస్తుందా? వస్తే దానిని తొలగించగలను.--స్వరలాసిక (చర్చ) 01:02, 6 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పునరుక్తిని గమనించే పద్ధతి ఏదైనా ఉందా![మార్చు]

రవిచంద్ర, వెంకటరమణ గార్లకు.. ఈ పేజీ ఇటీవలి చరిత్రలో మీ పేర్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ శీర్షికను జయప్రదంగా నిర్వహిస్తున్న మీ ఇద్దరికీ ధన్యవాదాలు. కొత్త విశేషాలను చేర్చే ముందు, గతంలో ఈసరికే చేర్చి ఉన్నాయో లేదో ఎలా పరిశీలిస్తున్నారనే సందేహం వచ్చింది. కొత్తగా చేరుస్తున్న వ్యాసాలు, పాఠ్యాల నుంచే ఈ విశేషాలను స్వీకరించడం ఒక పద్ధతి. ఇంకా వేరే పద్ధతులేమైనా ఉన్నాయా? పాత పేజీల్లో వెతుక్కోవడమేనా? __చదువరి (చర్చరచనలు) 02:15, 2 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారూ, నేను ఈ పేజీలో వాక్యాలలో అధిక శాతం కొత్త వ్యాసాల నుండి సేకరించి రాస్తున్నాను. ఇది వరకు ఉన్న మొలక వ్యాసాలైతే వాటిని విస్తరించి వాటిని కూడా కొన్ని సార్లు చేర్చుతున్నాను. కొత్త పేజీలైతే నిరంతరం పరిశీస్తుంటాను కాబట్టి అవి ప్రచురితమయ్యాయో లేదో తెలిసిపోతుంది. పాత వ్యాసాలను విస్తరించేటప్పుడు ఆ వాక్యాలను రాసేటప్పుడు ఆ వ్యాసంలో "ఈ పేజీకి లింకున్న పేజీలు" ట్యాబు ద్వారా ఇదివరకు ప్రచురితమయ్యాయో లేదో తెలుసుకుని చేర్చుతున్నాను.--కె.వెంకటరమణచర్చ 07:29, 2 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, నేను కూడా ఇందులో పాలుపంచుకున్నప్పటికీ వెంకటరమణ గారి తర్వాతే నేను. నేను కొత్త వ్యాసాల నుంచే వాక్యాలు ఉండాలని అనుకున్నాను మొదట్లో, కానీ కొన్ని వారాల్లో ఆసక్తికరమైన వ్యాసాలు ఉండేవి కావు. అటువంటప్పుడు కొన్ని ఇటీవలే ఓ మాదిరిగా విస్తరింపబడిన పాత వ్యాసాల్లో నుంచి వాక్యాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇదివరకే వాక్యాలు చేర్చారా లేదా అనేందుకు ప్రస్తుత సంవత్సరంలోని వాక్యాలే పరిశీలించేవాడిని. మిగతా వాటిని నా జ్ఞాపకాల్లోంచి వెతుక్కోవడమే. కొన్ని పునరుక్తి అయ్యుండవచ్చు కూడా. రవిచంద్ర (చర్చ) 13:24, 2 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకటరమణ, రవిచంద్ర గార్లకు, ధన్యవాదాలు. అలాగే పవన్ సంతోష్ గారూ.. మీకు కూడా ధన్యవాదాలు. ఈ పనిలో మీరు కూడా గణనీయమైన కృషి చేసి ఉన్నారు.
నాకు ఇష్టమైన, నేను ఎక్కువ పనిచేసిన కొన్ని వ్యాసాల నుండి సముచితమైన వాక్యాలను మీకు తెలుసా లోకి చేర్చాలను అనుకుంటున్నాను. ఉదాహరణకు - మంచుమనిషి, ఎంటెబీ ఆపరేషన్, సింధు లోయ నాగరికతకు సంబంధించిన పేజీలు, అంతరిక్షానికి, క్షిపణులకూ సంబంధించిన పేజీలు మొదలైనవి. మీరు చెప్పిన పద్ధతుల్లో వెతికి వీలైనంతవరకు పునరుక్తులు లేకుండా చూస్తాను. మీరు ఏమైనా గమనిస్తే నన్ను హెచ్చరించగలరు. ధన్యవాదాలు __చదువరి (చర్చరచనలు) 14:49, 2 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు, @Chaduvari: గారూ. దీనికొక మూస ఉందని గుర్తు. అది చర్చ పేజీలో పెడితే చర్చను చూస్తే ఇది ఇప్పటికే చేసేశాం అని గుర్తించవచ్చు.--పవన్ సంతోష్ (చర్చ) 16:35, 2 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా పేరుబరిలోని మీకు తెలుసా భండారము పేజీలో స్వేచ్ఛానకలుహక్కుల బొమ్మలు మాత్రమే వాడాలి.[మార్చు]

వికీపీడియా పేరుబరిలోని మీకు తెలుసా భండారము పేజీలో స్వేచ్ఛానకలుహక్కుల బొమ్మలు మాత్రమే వాడాలి. గతంలో అలావాడని బొమ్మల వాడుకను తొలగించాను. అర్జున (చర్చ) 02:07, 31 డిసెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

నేను పాటించే నియమావళి[మార్చు]

మీకు తెలుసా వాక్యాలు చేర్చేటపుడు నేను పాటించే నియమాలు. వేరే ఎవరైనా ఈ శీర్షికలో పాల్గొనేవారికి ఉపయోగకరంగా ఉంటాయని రాస్తున్నాను.

  • వాక్యాలు సాధ్యమైనంత వరకు కొత్త వ్యాసాల నుంచే సేకరిస్తాను. వీలు లేని పరిస్థితుల్లో పాత వ్యాసాలైనా ఇప్పటిదాకా ఈ శీర్షికలో ప్రచురించనివి ఎంపిక చేసుకుంటాను. ఇప్పటిదాకా ఒకసారి ప్రచురించిన వ్యాసమే మళ్ళీ ప్రచురించాల్సిన అవసరమైతే రాలేదు నాకు.
  • వాక్యంలోని విషయం ఒక సరికొత్త విషయం, చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయం అయిఉంటే బాగుంటుందని ప్రయత్నిస్తాను.
  • ఒక వారంలో చేర్చే వాక్యాలు ఐదింటిలో, వీలుంటే ఐదు వేర్వేరు అంశాలను సంబంధించిన విషయాలు ఉండేలా చూస్తాను. ఉదాహరణకు వ్యక్తులు, ప్రాంతాలు, సైన్సు, చరిత్ర, సాంకేతికం ఇలా...
  • వీలైనంత వరకు విశ్వసనీయమైన మూలాలు కలిగిన, వికీశైలిలో రాసిన వ్యాసాలు ఎంచుకుంటాను.

--రవిచంద్ర (చర్చ) 17:08, 13 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]