Jump to content

వికీపీడియా:మీడియా కాపీహక్కుల ప్రశ్నలు

వికీపీడియా నుండి

ఈగ బొమ్మ, కాపి హక్కులు....

[మార్చు]

ఆర్యా.... అంటు వ్యాథులు అనే గ్రంథం లిప్యంతీకరణ లో భాగంలో కొన్ని నిముషముల క్రితమే చేర్చిన ఈగ బొమ్మ గురించి పలగిరి గారు స్పందించి కొన్ని సూచనలిచ్చారు. ముందుగా వారికి ధన్యవాదాలు. గతంలో ఇదే గ్రందంలోని కొన్ని బొమ్మలను తీసి నేను వ్రాసిన లిప్యంతీకరణ గ్రందంలో చెర్చాను. అవి నేను తీసిన బొమ్మలు కాదు గనుక వాటికి ఎటువంటి కాపి హక్కులు చేర్చక వదిలేశాను. నా ఉద్దేశమేమంటే ఆ బొమ్మలన్ని ఆ పుస్తకములోనివే గనుక అందులో ఇబ్బంది వుండదని భావించినందున., ఆవిధంగా ఖాళీగా వుంచకూడదని కొన్ని సందేశాలు వచ్చాయి. ఇప్పుడు ఈగ బొమ్మ చేర్చాను. ఈ బొమ్మ నేను స్వంతంగా తీసిన పోటో.. కనుక పరవా లేదనుకొని కనబడిన ఏదో ఒక ఆప్షన్ ను నొక్కి ఆ ఈగ బొమ్మను చేర్చాను. తీర బొమ్మ ఎక్కించాక చూస్తే అది వికీపీడియాకొరకు మాత్రమే వాడుకోవచ్చునని సూచించి నట్లుగా వున్నది. ఇది ఇంకా మంచిదే అని అను కున్నాను. ఇది కూడ తప్పుగా వున్నట్లు ఇప్పుడు తెలియు చున్నది. ఈ కాపీ హక్కుల భాగోతం ఒక పెద్ద గందర గోళంలా వున్నది. ఈ విషయమై అవగాహన కొరకే తెవికి బడిలో చేరాను. వికీ కామన్సులో నా బొమ్మలు చేరుస్తున్నప్పుడు అవి నా స్వంతమే ననే ఆప్షన్ మీద నొక్కితే అన్ని చేరి పోతున్నాయి.

ఈగ బొమ్మను మరో ఆప్షన్ తో తిరిగి ఎక్కిస్తాను.... ఇది సరైనదేనా అనే విషయం పలగిరిగారు గాని, మరెవరైనా గమనించి సందేశమిస్తే ఆ విధంగానే ఇకపై మసలుకుంటాను... Bhaskaranaidu (చర్చ) 17:26, 22 అక్టోబర్ 2013 (UTC)