వికీపీడియా:వాడుకరులకు సూచనలు/అనువాదంలో మానవిక అనువాద శాతం
Jump to navigation
Jump to search
అనువాదంలో మానవిక అనువాద శాతం
[మార్చు]అనువాద పరికరం ద్వారా చేసే అనువాదంలో మానవిక శాతమెంత, యాంత్రికానువాద శాతమెంత అని తెలుసుకునేందుకు కింది లింకును వాడవచ్చు.
people.wikimedia.orgఈ పేజీని https://cxdebugger.toolforge.org/ వద్దకు తరలించారు.
అనువాద పరికరంలో అనువాదం చేస్తూంటే పై పేజీ ఎప్పటికప్పుడు తాజా అవుతూ అనువాద శాతాలను చూపిస్తూ ఉంటుంది.
మరిన్ని వివరాలు:
- --> పైన చూపిన url కు వెళ్తే అక్కడ కింది తెరపట్టులో చూపిన ఫారం కనిపిస్తుంది.
- --> ఈ ఫారములో Source language వద్ద en అని ఇవ్వాలి (english అని పూర్తిగా ఇవ్వరాదు). Target language వద్ద te అనీ (telugu అని పూర్తిగా ఇవ్వరాదు), Source title వద్ద ఇంగ్లీషు వ్యాసం పేరునూ కింద చూపిన విధంగా ఇచ్చి, Find బొత్తాన్నినొక్కాలి. కింది తెరపట్టు చూడండి
- --> అప్పుడు కింద చూపిన విధంగా ఫలితం వస్తుంది.
- --> పై తెరపట్టులో అడుగున ఉన్న Progress లైనులో మనకు అవసరమైన సమాచారాన్ని కనిపిస్తుంది. any అంటే ఇంగ్లీషు వ్యాసాంలో మనం అనువదించిన భాగం (పై తెరపట్టులో 0.8446. అంటే 84.46%), mt అంటే అనువదించిన దానిలో యాంత్రికానువాద భాగం (పై తెరపట్టులో 0.5565. అంటే 55.65%), human అంటే అనువదించిన దానిలో మానవిక అనువాద భాగం (పై తెరపట్టులో 0.4434. అంటే 44.34%).
- ఇక పై పేజీ లోని మిగతా అంశాలు కూడా ఆసక్తికరంగానే ఉంటాయి, పరిశీలించండి.