వికీపీడియా:వాడుకరులకు సూచనలు/archive-url లోని టైమ్‌స్టాంపు, archive-date రెండూ ఒకటే ఉండాలి
archive-url లోని టైమ్‌స్టాంపు, archive-date రెండూ ఒకటే ఉండాలి
[మార్చు]వ్యాసంలో మూలాన్ని చేర్చినపుడు, ఆ మూలాన్ని ఆర్కైవు చెయ్యడం అనేది ఉత్తమమైన పద్ధతి. ఆర్కైవు లింకు అనేది శాశ్వతమైనది, ఎప్పటికీ చచ్చిపోదు. తద్వారా, మూలంలో ఇచ్చిన url, కొద్దికాలం తరువాత డెడ్ అయినప్పటికీ ఆర్కైవు లింకు శాశ్వతంగా ఉండిపోతుంది కాబట్టి మూలం మాత్రం ఎప్పటికీ లైవుగానే ఉంటుంది. అంచేత కొత్త మూలాన్ని చేర్చినపుడెల్లా ఆర్కైవు చెయ్యడం తప్పనిసరి.
సాధారణంగా మూలాన్ని archive.org అనే సైటులో ఆర్కైవు చేస్తూంటాం. మూలపు url ను archive.org కు సమర్పించినపుడూ అది దాన్ని ఆర్కైవు చేసి ఒక archive-url ను ఇస్తుంది. దాన్ని తెచ్చి, వ్యాసం లోని మూలంలో చేర్చాలి. దానితో పాటు ఆర్కైవు చేసిన తేదీ, archive-date, ని కూడా చేర్చడం తప్పనిసరి. లేదంటే లోపం తలెత్తుతుంది. ఆర్కైవు చేసినది ఈ రోజునే అయితే archive-date ఇవ్వాళ్టి తేదీ అవుతుంది. అయితే మీరు ఆర్కైవు చెయ్యదలచిన url ను ఈసరికే గతంలో ఆర్కైవు చేసి ఉండవచ్చు. ఆ archive-url ను వాడినపుడు archive-date కూడా అప్పటిదే ఇవ్వాలి. ఇవ్వాళ్టి తేదీ ఇచ్చినా, మరొక తేదే ఇచ్చినా, తెవికీ లోపం చూపిస్తుంది. ఆర్కైవు చేసిన తేదీ ఎప్పుడనేది ఇలా కనుగొనాలి:
- ఒక పద్ధతి: archive.org లో అర్కైవ్ url కు వెళ్ళినపుడు తెరపై పైన కుడి చివర నలుపు రంగు నేపథ్యంలో తేదీని చూపిస్తుంది. అదే archive-date. పక్కనున్న తెరపట్టు చూడండి.
- మరో పద్ధతి: archive-url లోనే, టైమ్‌స్టాంపు రూపంలో archive-date ఇమిడి ఉంటుంది. archive-url ఇలా ఉంటుంది:
https://web.archive.org/web/20211224165002/https://...
. ఇందులో web/ తరువాత ఉన్న 20211224165002 అనేది టైమ్‌స్టాంపు. ఇందులో మొదటి నాలుగు అంకెలు (2021) సంవత్సరాన్ని, తరువాతి రెండు అంకెలు (12) నెలను, ఆ తరువాతి రెండు అంకెలు (24) తేదీనీ చూపిస్తాయి. (ఆ తరువాతి అంకెలు గంటలు, నిమిషాలు, సెకండ్లను సూచిస్తాయి) అంటే పై archive-url కు archive-date 2021-12-24 అన్నమాట! తెవికీ ఈ రెంటినీ పోల్చి చూసుకుంటుంది. పై url కు archive-date 2021-12-24 ఉంటే సరే, లేదంటే లోపం చూపించి సంబంధిత వర్గంలో వేస్తుంది.
గమనిక: మూలం లోని url ను ఆర్కైవు చేసేందుకు InternetArchiveBot అనే బాటు కూడా ఉంది. దీన్ని మానవికంగా ఎవరైనా నడపవచ్చు.