వికీపీడియా:వాడుకరులను నిలబెట్టుకోవడం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెవికీలో గత డిసెంబరు నెలలో 700 మంది కొత్త వాడుకరులు నమోదయ్యారు. మొత్తం నమోదైన వాడుకరులు 59,000 మంది ఉంటే, క్రియాశీలకంగా ఉన్నది మాత్రం 210 మంది. కొత్తగా చేరే వాడుకరులు ఆసలు రాయడం లేదు, లేదా ఒకటో రెండో దిద్దుబాట్లు చేసి మానేస్తున్నారు. కొద్దిమంది మాత్రం మరికాస్త ముందుకెళ్ళి 20 - 30 దాకా దిద్దుబాట్లు చేసి మానేస్తూ ఉండవచ్చు. మనం ఈ రెండు వర్గాల వారినీ వికీలోకి వచ్చేలా చేసి, వికీలో ఉండేలా చెయ్యాలి. కనీసం ఓ వంద దిద్దుబాట్ల వరకైనా వాళ్ళపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అందు కోసం చెయ్యాల్సిన పనులు - నాకు తోచినవి ఇక్కడ రాస్తున్నాను. మీరూ మీకు తోచిన ఉపాయాలను ఇక్కడ రాయండి.

(సీనియర్లను తిరిగి ఇక్కడికి రప్పించి, మళ్ళీ మనకు మార్గదర్శకత్వం చేసేలా ఒప్పించేందుకు కూడా ప్రయత్నాలు చెయ్యాలి. అవీ ఇక్కడ చేర్చాను.)

ఏమిటి, ఎందుకు?
క్ర.సం సమస్య కారణాలు.. బహుశా !
1 కొత్త వాడుకరులు నమోదు కాగానే మాయమైపోతున్నారు, ఎందుకు?
  1. ఎలా రాయాలో తెలియక;
  2. వికీ వాడుకరి ప్రియంగా ఉండకపోవడం వలన;
  3. నేర్చుకోవడం బాగా కష్టం కావడాన; ...
2 కొన్నాళ్ళు పనిచేసిన వాడుకరులు (ఓ 20 - 30 దిద్దుబాట్ల లోపు చేసాక) కొనసాగడం లేదు, ఎందుకు? పాత వాడుకరులు (నాతో సహా) వాళ్ళను బెదరగొడుతున్నారు;
3 సీనియరు వాడుకరులు, (నిర్వాహకులు కూడా) ఇటువైపు చూట్టం లేదు, ఎందుకు?
  1. తెవికీతో అలసిపోయి కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారేమో..!
  2. మనతో, మన పనులతో, మన పద్ధతులతో విసుగెత్తి పోయి ఉన్నారేమో..!
  3. అసలివేవీ కాకుండా నాలాగా జడత్వమేమో..! (మానేస్తే మానేసి ఉండడం, పనిచేస్తే చేస్తూనే ఉండడం)

పై సమస్యలను ఎదుర్కోవడానికి నా సూచనలు ఇక్కడ ఇస్తున్నాను. ఏ రంగు సమస్యకు ఆఅ రంగు పెట్టెలోనే సూచనలు ఉన్నాయి.

క్ర.సం ఏం చెయ్యాలి
1
  1. తెవికీ మూల సూత్రాలనీ, అవనీ ఇవనీ ఇచ్చి హడలగొడుతున్నామేమో అని నాకనిపిస్తోంది. స్వాగతంలో అలాంటి లింకులను తీసేద్దాం.
  2. కొన్ని పేజీల లింకులిచ్చి ఇక్కడ రాయండి. మీ ఇష్టమొచ్చిన ప్రయోగాలు చెయ్యండిక్కడ అని చెబుదాం. బూతులు, తిట్లు, నిందలూ తప్ప ఏమైనా రాసుకోవచ్చని చెబుదాం.
  3. తెలుగులో రాయడం ఎలాగో, ఎంత తేలికో చెబుదాం.
  4. ఒక కొత్తవాడుకరుల పేజీని పెట్టి, అక్కడ తమను పరిచయం చేసుకొమ్మందాం.
  5. నాతో ఏదైనా మాట్లాడాలంటే ఇదుగో ఈ లింకును నొక్కి, ఈ స్వాగతం మూస కిందనే మీ ర్రాయదలచింది రాసెయ్యండి. మీ జవాబు కోసం ఎదురుచూస్తూంటాను అని రాయాలి. సమాధానం రాకపోతే, ఓ రెండ్రోలు చూసి, మళ్ళీ రాయాలి.. ఏంటి సార్, రాయలేదేంటి, ఏమైనా ఇబ్బందా? అని మరో సందేశం రాద్దాం.
  6. ఇదుగో ఈ నంబరుకు ఫోను చెయ్యండి (మనకు ఇబ్బందేమీ లేకపోతేనే సుమా) అని ఈమెయిలు రాద్దాం.
  7. ఇన్ని పనులు చేసాక కూడా రాయకుడా ఉంటారంటారా.. చూద్దాం!
    1. రాయలేదనుకోండి, వదిలేద్దాం.
    2. రాసారనుకోండి.. వాళ్లను ఇదిగో ఈ కింది గడిలోని బృందానికి తగిలిద్దాం.
2
  1. కొత్తవారిని బెదరగొట్టవద్దు. కనీసం 100 దిద్దుబాట్లు అయ్యేవరకు, వాళ్ళు చేసిన తప్పులు/పొరపాట్లను చూసీ చూడనట్లు పోవాలి. అందుగ్గాను..
  2. ముగ్గురు నలుగురితో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ 100 దిద్దుబాట్ల కాలంలో కొత్తవారితో, వారి తప్పులు పొరపాట్లతో ఈ బృందసభ్యులు మాత్రమే వ్యవహరిస్తారు. పాతవారు వీరి తప్పుల గురించి ఈ బృందానికి మాత్రమే తెలియబరుస్తారు. నేరుగా వారికి చెప్పరు. ఎటువంటి చర్యలైనా ఈ బృంద సభ్యులే తీసుకుంటారు. వారు మొదలుపెట్టిన వ్యాసాల్లో మూసలు పెట్టడం లాంటివి చెయ్యం.
  3. ఈ బృందంలో పాత వాడుకరులెవరైనా ఉండొచ్చు. కనీసం ఒక నిర్వాహకుడైనా ఉండాలి -నిర్వాహక చర్యలేమైనా అవసరమైతే తీసుకునేందుకు. కొన్నాళ్ళ తరువాత బృందాన్ని మార్చవచ్చు. ఇప్పటి కొత్తవారిని కూడా అప్పుడు (పాతబడ్డాక) చేర్చుకోవచ్చు. కొత్తవారి బాధలేంటో కొత్తవారికే బాగా తెలుస్తాయి.
  4. కొన్నాళ్ళు రాసి మానేసిన వాడుకరులను ఈ బృందం ఈమెయిళ్ళ ద్వారా ఆహ్వానిస్తుంది.
  5. 100 దిద్దుబాట్లయ్యాక, ఈ సంరక్షణ కాలం నుండి బయటికి అడుగుపెడతారు. ఏ సమయంలోనైనా ఈ బృందం రక్షణలో ఓ ఇరవై మంది దాకా ఉండాలనేది మన ఆశయంగా పెట్టుకోవచ్చు.
3
  1. సీనియర్లతో కలిసి పనిచేసిన వాడుకరులు, వాళ్ళకు ఈమెయిళ్ళు రాసి ఆహ్వానిస్తారు.
  2. తీసుకున్న విశ్రాంతి చాలు గానీ, ఇక రండి అని అభిమానంగా గద్దిస్తారు.
  3. ఎవరి మీదో, ఎవరో చేసిన పనుల మీదో కోపం వస్తే తెవికీని వదిలెయ్యడమేంటి సార్.. అని తర్కిస్తారు.
  4. ముందు ఈ పేజీ లింకును అందరికీ పంపిస్తాం.