వికీపీడియా:వికీప్రాజెక్టు/కొత్త ట్వింకిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు వికీపీడియాలో కొత్త ట్వింకిల్ ఉపకరణాన్ని స్థాపించడం, దాన్ని మన అవసరాలకు తీర్చిదిద్దడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

అవసరం[మార్చు]

తెవికీలో ప్రస్తుతం ఉన్న ట్వింకిల్ ఉపకరణం సరిగా పనిచేయడం లేదు. దాని స్థానికీకరణ కూడా కోడు లోనే చేయడం వల్ల పైనుండి ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను మన ట్వింకిల్‌లో చేసుకోవడం చాలా పని, దానిలో పొరపాట్లకు అవకాశం ఎక్కువ. ఇలాంటి సమస్యలను నివారించేందుకు ట్వింకిల్ ఉపకరణాన్ని తతిమా వికీలు స్థానికీకరణ చేసి వాడుకోగలిగిన విధంగా ఒక ప్రయత్నం నడుస్తున్నది. ప్రస్తుతం ట్వింకిల్‌ను ఇతర వికీలలో వాడుకోడానికి ఇది సిఫారసు చేయబడిన పద్ధతి. ఈ ప్రయత్నంలో భాగంగా ట్వింకిల్ మూల సౌలభ్యాలనూ, స్థానికీకరణ సందేశాలను విడదీసారు. అందువల్ల (1) ట్వింకిల్ మూల ఉపకరణాన్ని ట్రాన్స్‌లేట్‌వికీలో స్థానికీకరించవచ్చు; (2) స్థానికీకరణతో సంబంధం లేకుండా ట్వింకిల్లో జరిగే మూల మార్పులను ఇతర వికీలు తెచ్చుకోగలిగే వీలుంటుంది; (3) ఎన్వికీ ట్వింకిల్ సౌలభ్యాలను ఇతర వికీలు తమకు తగ్గట్టు మలచుకునే వీలుంటుంది.

స్థితి[మార్చు]

 • తదుపరి: చేర్చిన మాడ్యూళ్ళను పరీక్షించడం, వాటిని తెలుగించడం.
 • 2021-12-02: speedy మాడ్యూలు చేరింది
 • 2021-11-23: ట్వింకిల్-కోర్ నిర్మించి fluff, xfd మాడ్యూళ్ళతో దాన్ని వాడుకరి స్క్రిప్టుగా తెవికీలో విజయవంతంగా నడపగలిగాము.

కార్యరంగం (లేదా నేనెలా తోడ్పడగలను?)[మార్చు]

పరీక్షించి చూడడం[మార్చు]

 1. ముందుగా, పాత ట్వింకిల్ ఉపకరణం అచేతనంగా ఉందని నిశ్చయించుకోండి. (అభిరుచులు > ఉపకరణాలు > ⧼gadget-Twinkle⧽ దీని టిక్కు తీసేయండి.)
 2. ఆపై, మీ వాడుకరి జావాస్క్రిప్టు పేజీలో ఈ క్రింది పంక్తులను చేర్చుకోండి:
  /* On-wiki User Script (Veeven's) */
  importScript('User:Veeven/twinkle.js');
  
 3. దీన్ని వాడటంలో సమస్యలు ఎదురైతే చర్చా పేజీలో నివేదించండి.

మాడ్యూళ్ళు[మార్చు]

ట్వింకిల్ లోని సౌలభ్యాలు వివిధ మాడ్యూళ్ళగా విభజించబడి ఉంటాయి. వీటిలో తెవికీకి కావలసిన వాటిని మనం ఎంచుకోవచ్చు:

 • Fluff: మార్పులను తిరగ్గొట్టడం
 • Diff: మార్పులను చూడడానికి లంకెలు
 • Tag: పేజీలకు నిర్వహణ సంబంధిత ట్యాగులను చేర్చడం
 • XFD: పేజీలు, మూసలు, దస్త్రాలు, ఇలా వేటినైనా తొలగింపు ప్రతిపాదనలు
 • Speedy: త్వరిత తొలగింపు ప్రతిపాదన; (నిర్వాహకులు) తొలగించడం
 • Warn: దుశ్చర్యలు, ఇతర సమస్యలపై వాడుకరులకు హెచ్చరికలు ఇవ్వడం
 • Block: (నిర్వాహకులు) నిరోధాలు విధించడం, సంబంధిత మూసలను వాడుకరులు చర్చాపేజీలలో చేర్చడం
 • Protect: పేజీ సంరక్షణ ప్రతిపాదనలు; (నిర్వాహకులు) సంరక్షించడం, మూసలు చేర్చడం
 • Unlink: పేజీల లంకెలను ఇతర పేజీలనుండి తొలగించడం
 • BatchDelete: (నిర్వాహకులకు) గంపగుత్తగా పేజీలను తొలగించడం
 • BatchUndelete: (నిర్వాహకులకు) తొలగించిన పేజీలను గంపగుత్తగా పునఃస్థాపించడం