వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి/నమూనా వ్యాసాలు/సరోజ్ రాజ్ చౌదురి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సరోజ్ రాజ్ చౌదురి
జననం
ఒడిశా.
వృత్తివన్యప్రాణి సంరక్షకుడు, పర్యావరణవేత్త
పురస్కారాలుపద్మశ్రీ

సరోజ్ రాజ్ చౌదురి భారతీయ పర్యావరణవేత్త, వన్యప్రాణి సంరక్షకుడు, రచయిత. ఇతను ఒడిశా ప్రభుత్వం ద్వారా మొట్టమొదటి అటవీ సంరక్షకుడిగా నియమించబడినాడు. ఒడిషాలోని మయూర్ భంజ్ జిల్లాలోని సింలిపాల్ జాతీయ ఉద్యానవన వ్యవస్థాపక డైరెక్టర్ గా కూడా సరోజ్ రాజ్ చౌదురి ఉన్నారు[1]. పులి జనాభా లెక్కల కోసం ఉపయోగించిన పగ్ మార్క్ టెక్నిక్ కు, పెంపుడు పులి అయిన ఖైరీతో తన సహచరత్వానికి చౌదురి పేరుగాంచాడు[2][3] . జంతువుతో అతని అనుభవాలు ఖైరీ ది బిలవ్డ్ టిగ్రెస్ అనే పుస్తకంలో పొందుపరిచాడు.[4] ఈ పుస్తకం 1977 లో ప్రచురించబడింది. 1983లో భారత ప్రభుత్వం నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ [5] చౌదురికి ప్రదానం చేసింది.

జీవిత చరిత్ర

[మార్చు]

జననం ,వృత్తి జీవితం

[మార్చు]

సరోజ్ రాజ్ చౌదురి జన్మస్థలం ఒడిశా. ఇతడు ఒడిశా ప్రభుత్వంలో అటవీ అధికారిగా తన వృత్తిని ప్రారంభించి, వన్యప్రాణి సంరక్షణ అధికారిగా పదోన్నతి పొంది ఆ పదవిలో నియమించబడిన మొదటి వ్యక్తిగా నిలిచారు.[6] 1878 లో జర్మన్కు చెందిన డైట్రిచ్ బ్రాండిస్ [7]చే స్థాపించబడిన ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధిపతిగా నియమించబడినాడు. 1972లో సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ స్థాపించబడినప్పుడు, చౌదురి దాని వ్యవస్థాపక క్షేత్ర స్థాయి అధ్యక్షుడుగాను, బారిపాడాలోని తన ప్రధాన కార్యాలయంతో ప్రాజెక్ట్ టైగర్ అధిపతిగా నియమించబడ్డాడు.

చౌదురి జీవితంలో మైలురాయి

[మార్చు]

1974లో ఖరియా గిరిజనులు ఖైరీ నది సమీపంలో దొరికిన ఆడ పులి పిల్లను చౌదురి దగ్గరికి తీసుకువచ్చారు. దానిని చౌదురి తన సంరక్షణలోకి తీసుకొని దానికి వసతి కల్పించేందుకు వీలుగా జషిపుర్ కు తన నివాసాన్ని మార్చాడు. ఖైరీ నది సమీపంలో దొరికినందుకు గుర్తుగా దానికి ఖైరీ అనే పేరు పెట్టాడు. ఖైరీ పెద్దదయిన తరువాత కూడా అనేక సంవత్సరాలు అతడితోనే ఉండిపోయింది. చౌదురి జీవితంలో ఒక మైలురాయి ఈ సంఘటనను చెప్పవచ్చు. అతను తన నివాసంలో మొసలి, జుంబు అనే ఎలుగుబంటి పిల్ల, బైనా అనే గుడ్డి హైనా, ముంగిస వంటి అనేక ఇతర అడవి జంతువులను కూడా పెంచాడు. అవన్నీ అతని ప్రాంగణంలో స్వేచ్ఛగా తిరిగేవి. ఈ విధంగా వన్యప్రాణుల సంరక్షణ రంగంలో అనేక కార్యక్రమాలు చేసిన ఘనత చౌదురికి దక్కింది.

పులుల జనాభా లెక్కల కోసం ప్రత్యేక పద్దతి

[మార్చు]

భారతదేశంలో పులుల జనాభా లెక్కల కోసం పగ్మార్క్ పద్ధతిని ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి చౌదురియే. 1972 లో భారతదేశంలో మొదటి పులుల జనాభా లెక్కలకు చౌదురి నాయకత్వం వహిస్తున్నప్పుడు అతను ప్రవేశపెట్టిన ఒక పద్ధతి పగ్మార్క్, తరువాత కాలమో ఈ పద్ధతినే భారతదేశం అంతటా ఉపయోగించే విధంగా ప్రసిద్ధి పొందింది. ఖైరీ ని పరిశీలించిన ఆధారంగా, ఖైరీ కదలికల రోజువారీగా నమోదు చేయడం ద్వారా, పులుల ప్రవర్తనా సరళిపై ముఖ్యంగా ఫెరోమోన్ల అంశంపై చౌదురి పరిశోధన చేశాడు. ఇతడు చేసిన ప్రయోగం తరువాత కాలంలో ఆర్.ఎల్. బ్రహ్మచారి పరిశోధనకు ఎంతగానో సహాయపడింది.

అడవి దంతాలను పట్టుకోవటానికి ట్రాంక్విలైజర్లను ఉపయోగించే విధానాన్ని ప్రవేశపెట్టింది చౌదురియే. అతని అధ్యయనాలు అనేక పత్రికలలో ప్రచురించబడినవి. అతని స్వీయచరిత్ర పుస్తకం ఖైరీ: ది బిలవ్డ్ టిగ్రెస్ లో కూడా అనేక విషయాలు పొందుపరచబడినవి. చౌదురికి సలీం అలీ వంటి ఇతర సంరక్షకులతో చౌదురికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చౌదురి ఖైరీ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ను స్థాపించాలనుకున్నపుడు సలీం అలీచొరవ చూపారు. అధికారులు చూపించిన నిరాసక్తత కారణంగా ఇది కార్యరూపం దాల్చలేదు.

భారత ప్రభుత్వం చౌదురికి1983లో పద్మశ్రీ పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఖైరీకి కుక్క కాటు వల్ల రేబిస్ సోకినప్పుడు ఎక్కువ మోతాదులో ట్రాంక్విలైజర్లు యూథనైజ్ చేయడం వలన అది ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు.[8]

మూలాలు

[మార్చు]
  1. https://www.downtoearth.org.in/reviews/love-requited-17561
  2. http://www.similipal.org/similipal-heros.php
  3. https://www.conservationindia.org/wp-content/files_mf/Killer-Cats-Final_Nov-4-2011.pdf
  4. https://books.google.co.in/books?id=ErzFAAAACAAJ&redir_esc=y
  5. http://www.dashboard-padmaawards.gov.in/?Award=Padma%20Shri&Year=1983-1983
  6. https://www.abebooks.co.uk/9788185019710/Khairi-Beloved-Tigress-Chowdhary-Saroj-8185019711/plp
  7. https://archive.org/details/transactionsofsc11scot/page/154/mode/2up?view=theater
  8. https://books.google.co.in/books?id=Chxpu5jU3VYC&q=Saroj+Raj+Choudhury+biography&pg=PA21&redir_esc=y#v=snippet&q=Saroj%20Raj%20Choudhury%20biography&f=false