వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక/పాఠ్యాశాలు/మొదటిపేజీ పరిచయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1. మొదటి పేజీ అంటే ఏమిటి? అందులో ఏఏ అంశాలు ఉంటాయి?

తెలుగు వికీపీడియా (te.wikipedia.org) ఓపన్ చేయగానే మొదటి పేజీ కనిపిస్తుంది. ఈ మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం, చరిత్రలో ఈ రోజు, ఈ వారపు బొమ్మ, మీకు తెలుసా?, మార్గదర్శి, సోదర ప్రాజెక్టులు మొదలైన అంశాలు ఉన్నాయి.

2. చర్చాపేజీ ఏమిటి? దాని ఉపయోగం ఏమిటి?

వ్యాసాలనికి (పేజీకి) సంబంధించిన మార్పులు, ఇతర అంశాల గురించి వాడుకరులు చర్చలు జరిపే పేజీని చర్చాపేజీ అంటారు. వ్యాసాన్ని మెరుగుపరచడానికి సంబంధించి ఏదైనా ప్రశ్నలేదా వ్యాఖ్య ఉంటే వ్యాసపు చర్చాపేజీలో దాన్ని రాయవచ్చు.

3. ఈ వారపు వ్యాసం విభాగంలో ఏం ఉంటుంది?

ఈ వారపు వ్యాసం విభాగంలో ఈ వారం ఎంపిక చేసిన వ్యాసం పేరు, వ్యాసంలోని కొంత సమాచారం, వ్యాసపు లింకు ఉంటుంది. వికీపీడియాలో ఉన్న మంచి మంచి వ్యాసాలను ఏరి వాటిని అందరికీ ప్రదర్శించటమే ఈ వారం వ్యాసం లక్ష్యం.

4. చరిత్రలో ఈ రోజు విభాగంలో ఏం ఉంటుంది?

చరిత్రలో ఆయా రోజులలో (తేదీలలో) జరిగిన సంఘటనలు గానీ, ప్రముఖ వ్యక్తుల జనన మరణ వివరాలు గానీ చరిత్రలో ఈ రోజు విభాగంలో ఉంటాయి.

5. ఈ వారపు బొమ్మ విభాగంలో ఏం ఉంటుంది?

ఈ వారపు బొమ్మ విభాగంలో ఈ వారం ఎంపిక చేసిన బొమ్మ, దాని వివరాలు, బొమ్మను చేర్చిన వారి పేరు ఉంటాయి, వికీపీడియాలో ఉన్న మంచి మంచి బొమ్మలను ఏరి వాటిని అందరికీ ప్రదర్శించటమే ఈ వారం బొమ్మ లక్ష్యం.

6. మీకు తెలుసా? విభాగంలో ఏం ఉంటాయి?

వికీపీడియా వ్యాసాలలోని కొత్త విషయాలు ఈ విభాగంలో ఉంటాయి. ఇవి వ్యాసాల మార్పులను బట్టి ప్రతివారం 5 అంశాల చొప్పున ఎంపిక చేయబడుతాయి.

7. మార్గదర్శి విభాగంలో ఏం ఉంటాయి?

వికీపీడియాలో ఎలాంటి వ్యాసాలు ఉన్నాయో వాడుకరులకు తెలియజేయడంకోసం ఈ విభాగం ఏర్పాటుచేయబడింది. ఇందులోని నచ్చిన అంశాలను ఎంచుకొని వాడుకరులు వ్యాసాలను రాయవచ్చు.

8. సోదర ప్రాజెక్టులు ఏవి? వాటి ఉపయోగం ఏమిటి?

వికీపీడియాతోపాటు మరికొన్ని వికీపీడియా ప్రాజెక్టులు ఉన్నాయి. వాటన్నింటిని కలిపి సోదర ప్రాజెక్టులు అంటారు. అవి: వికీకామన్స్ (ఉమ్మడి వనరులు), వికీసోర్స్ (మూలములు), వికీడేటా (వికీడేటా), వికీబుక్స్ (పాఠ్యపుస్తకములు), విక్షనరీ (శబ్దకోశము), వికీకోట్ (వ్యాఖ్యలు), మెటా-వికీ (ప్రాజెక్టుల సమన్వయము)

9. మార్పులు చేర్పులు విభాగంలో ఏవి ఉంటాయి?

వాడుకరి తను వికీపీడియాలోని ఏఏ పేజీలలో, ఎప్పుడెప్పుడు ఏఏ మార్పులు చేశాడో ఈ విభాగంలో ఉంటాయి.

10. ఖాతా సృష్టించుకోండి విభాగం ఉపయోగం ఏమిటి?

ఖాతా సృష్టించుకోండి నొక్కినపుడు ఖాతా సృష్టించుకోవడం కోసం మరో పేజీ ఓపన్ అవుతుంది. అందులో వివరాలు చేర్చి వికీపీడియా ఖాతాను సృష్టించుకోవచ్చు.

11. లాగినవండి విభాగం ఉపయోగం ఏమిటి?

లాగినవండి విభాగం నొక్కినపుడు లాగిన్ పేజీ ఓపన్ అవుతుంది. అందులో వికీపీడియా ఖాతా వివరాలు చేర్చి లాగిన్ అవవచ్చు.

12. చరిత్ర అనే విభాగంలో ఏం ఉంటుంది?

వ్యాసం సృష్టించబడినప్పటి నుండి వ్యాసంలో ఎప్పుడెప్పుడు ఏఏ మార్పులు జరిగాయో, ఏఏ వాడుకరి ఏఏ మార్పులు చేశారో మొదలైన వివరాలు చరిత్ర విభాగంలో ఉంటాయి.

వీడియో పాఠ్యం

[మార్చు]

అంతర్జాలంలోని ప్రతి వెబ్సైటుకు మొదటిపేజీ ఉన్నట్టుగానే, తెలుగు వికీపీడియాకు కూడా ఒక ‘మొదటి పేజీ’ ఉంటుంది. తెలుగు వికీపీడియా మొదటి పేజీ అంటే ఏమిటి, అందులో ఏఏ అంశాలు ఉంటాయనేది మనమిప్పుడు తెలుసుకుందాం.

అంతర్జాలంలో తెలుగు వికీపీడియా తెరవగానే మనకు మొదటి పేజీ కనిపిస్తుంది. అయితే చాలామంది ఈ పేజీని చూడకుండా వదిలేస్తుంటారు. నిజానికి, ఈ పేజీలో మనకు అవసరమైన సమాచారం చాలానే ఉంటుంది. మొదటిపేజీలో.. ఈ వారపు వ్యాసం, చరిత్రలో ఈరోజు, ఈ వారపు బొమ్మ, మీకు తెలుసా?, మార్గదర్శి, సోదర ప్రాజెక్టులు మొదలైన అంశాలు ఉంటాయి.

మొదటిపేజీలో ఎడమవైపు పైభాగంలో మొదటిపేజీ ట్యాబ్ పక్కన ‘చర్చ’ అనే ట్యాబ్ ఉంటుంది. దానిని నొక్కితే చర్చాపేజీ తెరువబడుతుంది. ఒక వ్యాసానికి సంబంధించిన మార్పులు, ఇతర అంశాల గురించి వాడుకరులు ఒకరికొకరు చర్చలు జరిపే పేజీని చర్చాపేజీ అంటారు. వ్యాసాన్ని మెరుగుపరచడానికి సంబంధించిన ఏదైనా ప్రశ్ననుగానీ లేదా వ్యాఖ్యనుగానీ వ్యాసం చర్చాపేజీలో రాయవచ్చు.

మొదటి పేజీలో ఎడమవైపున ఈ వారపు వ్యాసం అనే విభాగం ఉంటుంది. తెలుగు వికీపీడియాలో ఆ వారంలో ఎంపిక చేసిన వ్యాసం పేరు, ఆ వ్యాసానికి సంబంధించిన కొంత సమాచారం, వ్యాసం లింకు ఈ విభాగంలో ఉంటాయి. తెలుగు వికీపీడియాలో ఉన్న మంచిమంచి వ్యాసాలను ఎంపికచేసి వాటిని అందరికీ చూపించడంకోసం ఈ వారం వ్యాసం అనే విభాగం ఏర్పాటుచేయబడింది.

ఈ వారపు వ్యాసం విభాగం పక్కన కుడివైపున ‘చరిత్రలో ఈ రోజు’ అనే విభాగం ఉంటుంది. చరిత్రలో ఆయా రోజులలో జరిగిన సంఘటనలు గానీ, ప్రముఖ వ్యక్తుల జనన మరణ వివరాలు గానీ ఈ విభాగంలో ఉంటాయి.

చరిత్రలో ఈ రోజు విభాగం కింద ‘ఈ వారపు బొమ్మ’ అనే విభాగం ఉంటుంది. తెలుగు వికీపీడయా కోసం ఆ వారం ఎంపిక చేసిన బొమ్మ, దాని వివరాలు, బొమ్మను చేర్చిన వారి పేరు ఉంటాయి. వికీపీడియాలో ఉన్న మంచి మంచి బొమ్మలను ఎంపికచేసి వాటిని అందరికీ చూపించడంకోసం ఈ వారం బొమ్మ అనే విభాగం ఏర్పాటుచేయబడింది.

ఈ వారపు వ్యాసం విభాగం కింద ‘మీకు తెలుసా?’ అనే విభాగం ఉంటుంది. వికీపీడియా వ్యాసాలలోని కొత్త విషయాలు మీకు తెలుసా విభాగంలోఉంటాయి. వ్యాసాల మార్పులను బట్టి ప్రతివారం 5 అంశాల చొప్పున ఎంపిక చేయబడుతాయి.

వీటన్నింటి కింద మార్గదర్శి అనే విభాగం ఉంటుంది. తెలుగు వికీపీడియాలో ఎలాంటి వ్యాసాలు ఉన్నాయన్న విషయం వాడుకరులకు తెలియజేయడంకోసం ఈ విభాగం ఏర్పాటుచేయబడింది. ఇందులోని నచ్చిన అంశాలను ఎంపిక చేసుకొని వాడుకరులు వ్యాసాలను రాయవచ్చు.

మార్గదర్శి విభాగం కింద సోదర ప్రాజెక్టులు అనే విభాగం ఉంటుంది. వికీపీడియాతోపాటు మరికొన్ని వికీపీడియా ప్రాజెక్టులు ఉన్నాయి. వాటన్నింటిని కలిపి వికీపీడియా సోదర ప్రాజెక్టులు అంటారు. అవి: వికీకామన్స్, వికీసోర్స్, వికీడేటా, వికీబుక్స్, విక్షనరీ, వికీకోట్, మెటా-వికీ. ఇక ఇప్పుడు మొదటిపేజీలో కుడివైపు పైభాగంలో ఉన్న విభాగాల గురించి తెలుసుకుందాం..

ఇక్కడున్న ‘మార్పులు చేర్పులు’ అనేదాన్ని నొక్కినపుడు, మరోపేజీ తెరువబడుతుంది. అందులో, వాడుకరి తను తెలుగు వికీపీడియాలోని ఏఏ పేజీలలో, ఎప్పుడెప్పుడు ఏఏ మార్పులు చేశాడో కనిపిస్తుంది.

‘ఖాతా సృష్టించుకోండి’ నొక్కినపుడు, ఖాతా సృష్టించుకోవడం కోసం మరోపేజీ తెరువబడుతుంది. అందులో వివరాలు చేర్చి వికీపీడియా ఖాతాను సృష్టించుకోవచ్చు.

‘లాగినవండి’ అనేదాన్నినొక్కినపుడు లాగిన్ పేజీ తెరువబడుతుంది. అందులో వికీపీడియా ఖాతా వివరాలు చేర్చి లాగిన్ అవవచ్చు.

‘చరిత్ర’ అనే విభాగాన్ని నొక్కినపుడు కూడా కోసం మరోపేజీ తెరువబడుతుంది. వ్యాసం సృష్టించబడినప్పటి నుండి వ్యాసంలో ఎప్పుడెప్పుడు ఏఏ మార్పులు జరిగాయో, ఏఏ వాడుకరి ఏఏ మార్పులు చేశారో మొదలైన వివరాలు చరిత్ర విభాగంలో ఉంటాయి.