Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ మహిళావరణం/హైదరాబాద్/2018 ఫిబ్రవరి కార్యశాల

వికీపీడియా నుండి

తెలుగు వికీపీడియాలో మహిళల భాగస్వామ్యం పెంపొందించేందుకు ప్రత్యేకించి మహిళలకు నిర్వహిస్తున్న కార్యశాల ఇది. తెలుగు వికీపీడియాలో మహిళల భాగస్వామ్యం పెంపొందించి, మరింత మంది మహిళా వికీపీడియన్లు కృషిచేయడం లక్ష్యంగా 2018 ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే కార్యశాలల్లో ఇది మొదటిది. ఈ లక్ష్యాలతో ఏర్పడ్డ వికీప్రాజెక్టు/తెవికీ మహిళావరణంలో ఇది భాగం. కార్యక్రమ నిర్వహణలో అందరూ భాగం పంచుకోవచ్చు, ఐతే కార్యక్రమం మహిళలకు ప్రత్యేకించినది.

వివరాలు

[మార్చు]
ప్రదేశం
స్వేచ్ఛ సంస్థ కార్యాలయం, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వెనుక, గచ్చిబౌలీ x రోడ్లు, హైదరాబాద్-500032
తేదీలు, సమయం
2018 ఫిబ్రవరి 24, 25 - ఉదయం.10 నుంచి సాయంత్రం 4.30 వరకు

కార్యక్రమ నిర్వహణ

[మార్చు]

నిర్వహణ సహకారం

[మార్చు]
  • స్వేచ్ఛ

చర్చించే అంశాలు

[మార్చు]
  • తెలుగు వికీపీడియాలో మహిళలు ఎందుకు రాయాలి?
    • స్వేచ్ఛా విజ్ఞానం
    • తెలుగులో విజ్ఞానం అవసరం
    • సమాచారంలో వైవిధ్యం
    • వ్యవస్థీకృత అప్రయత్న వివక్షను తగ్గించడం
  • తెలుగు వికీపీడియాలో రాయడం ఎలాగ?
    • ఖాతా సృష్టించడం
    • ఏ అంశాలపై రాయవచ్చు
    • వికీపీడియా మూల సూత్రాలు
    • మూలాల ఆవశ్యకత
  • కృషిచేయడానికి అవసరమయ్యే అంశాలు
    • మూలాలు ఎలా దొరుకుతాయి?
    • నిష్పాక్షికత ఎలా సాధించాలి?
    • మౌలికంగా పనికివచ్చే ఉపకరణాలు
  • వికీమీడియా ప్రపంచం
    • వికీపీడియా సోదర ప్రాజెక్టులు
    • వికీపీడియా లక్ష్యం, దానికోసం జరుగుతున్న ప్రయత్నాలు
  • మహిళావరణం
    • తోటి మహిళా వికీపీడియన్ల కృషి
    • మహిళల భాగస్వామ్యం పెంపుకు ఏం చేయవచ్చు
      • సభ్యుల నుంచి నిర్వాహకులు నేర్చుకుంటారు
    • సమిష్టి కృషికి వేదిక

ముందస్తు నమోదు

[మార్చు]

కార్యక్రమంలో పాల్గొనదలిచిన సభ్యులు మహిళలు అయివుండి ఆసక్తి ఉన్నవారైతే సరిపోతుంది. కార్యక్రమం ఏర్పాట్లకు ఉపకరించేందుకు 23 తేదీ సాయంత్రం లోగా వికీపీడియాలో ఖాతా సృష్టించుకుని ఇక్కడ సంతకం చేయడం కానీ, కార్యక్రమంలో మీ ఆసక్తిని తెలియజేస్తూ pavansanthosh.s@gmail.comకి మెయిల్ పంపడం కానీ చేయమని మనవి.