Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/వర్గాల పేర్ల, లింకుల క్రమబద్ధీకరణ

వికీపీడియా నుండి

వికీపీడియాలో వర్గాలనూ వర్గీకరణనూ నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ఈ వర్గాల పేర్ల, లింకుల క్రమబద్ధీకరణ. వికీపీడియా విధానాలకు అనుగుణంగా వర్గాల పేర్లను సవరించడం, వర్గాల నుండి సంబంధిత ఎన్వికీ వర్గాలకు లింకులివ్వడం (వికీడేటా ద్వారా), కొత్త వర్గాలను సృష్టించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం

మెరుగైన వర్గీకరణ కోసం

[మార్చు]
  • వర్గాల పేర్లను ప్రామాణికీకరించాలి. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ (మధ్యలో స్పేసు ఉండడం ఉండకపోవడం) కర్నాటక, కర్ణాటక, నృత్య కళాకారులు/నృత్యకళాకారులు/నాట్య కళాకారులు వగైరా పేర్లతో వచ్చే వర్గాలను చూడండి. ఈ పేర్ల కోసం ఒక ప్రామాణికమైన పద్ధతి ఎంచుకోవాలి.
  • వర్గాలకు ఎన్వికీ లింకులివ్వాలి. తద్వారా ఆయా వర్గాల్లోని వ్యాసాలను అనువదించేటపుడు సంబంధిత వర్గాలు ఆటోమాటిగ్గా వచ్చి చేరతాయి.
  • పేజీల్లో వర్గాలను చేర్చేటపుడు, ఇదే విధమైన పేజీలలో ఏయే వర్గాలున్నాయో పరిశీలించండి. తద్వారా సరైన వర్గాలను చేర్చడం సులభమౌతుంది.
  • మీరు చేర్చదలచిన వర్గం ఉనికిలో లేనపుడు (ఎర్రలింకు వచ్చినపుడు) వేరేపేరుతో అలాంటి వర్గమే ఉందేమో చూదండి. లేనట్లైతే సముచితమైన పేరుతో కొత్త వర్గాన్ని సృష్టించండి. వ్యాసాల్లో ఎర్రవర్గం చేర్చవద్దు

పేర్ల ప్రామాణీకరణ

[మార్చు]

వర్గం పేర్లు ఎలా ఉండాలనే విషయమై కొన్ని ప్రామాణికాల కోసం వికీపీడియా:వర్గీకరణ పేజీ చూడవచ్చు. అయితే వాస్తవంలో పేర్ల విషయంలో అనేక సమస్యలున్నాయి

  • భారత దేశం/భారతదేశం, తెలంగాణలోని/తెలంగాణ లోని, కేరళ లోని/కేరళకు చెందిన, భారత/భారతీయ, నియోజక వర్గం/నియోజకవర్గం... ఈసమస్యలను కొన్నిటిని చర్చల ద్వారా అధిగమించాం గానీ ఇలాంటి ఇంకా అనేకం ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు -
  • అమెరికన్లు, బ్రెజిలియన్లు, ఇటాలియన్లు.. ఇలాంటివి ప్రాచుర్యంలో ఉన్నమాట నిజమే గానీ తెలుగుకు స్వాభావికమైనవి కావు ("తమిళులు" అనేది మనకు స్వాభావికం గానీ తమిళియన్లు స్వాభావికం కాదు) అది ఇంగ్లీషు నుండి వచ్చిన వాడుక.
  • అలాగే యునైటెడ్ కింగ్‌డం వాసులను ఏమనాలి - ఇంగ్లీషు వ్యక్తులు/బ్రిటిషు వ్యక్తులు/ఇంగ్లాండు వ్యక్తులు/బ్రిటను వ్యక్తులు/యుకె వ్యక్తులు?
  • "ఇంగ్లీషు రచయితలు" అంటే ఇంగ్లీషులో రాసే రచయితలు అనా లేక ఇంగ్లాండుకు చెందిన రచయితలు అనా?
  • "ఇంగ్లీషు పుస్తకాలు" అంటే ఇంగ్లీషులో రాసిన పుస్తకాలా లేక ఇంగ్లాండుకు చెందిన పుస్తకాలు అనా? ఇది మరింత స్పష్టంగా ఉండాలి
  • నృత్య కళాకారులు/నృత్యకళాకారులు/నాట్య కళాకారులు - ఇలా వివిధ పేర్లతో వర్గాలున్నాయి. స్పేసు ఉండాలా లేదా అనే విచికిత్సతో పాటు "నృత్య", "నాట్య" అనే రెండు పేర్ల వాడుక కూడా తికమక కలిగిస్తోంది.
  • మహిళా క్రీడాకారులు/క్రీడాకారిణులు రెండు పేర్ల తోటీ వర్గాలున్నాయి. ఏది ఉంచాలి? ఇలాంటి "మహిళా" వర్గాలు ఇంకా ఉండొచ్చు.. ఉదాహరణకు మహిళా రచయితలు/రచయిత్రులు

ఇలాంటి విషయాలపై ఈ ప్రాజెక్టు ద్వారా స్పష్టత ఇవ్వడమే కాదు, ప్రామాణికాలను కూడా రూపొందిస్తే ముందుముందు ఇలాంటి సమస్యలను నివారించవచ్చు ఇలాంటి సందిగ్ధంగా ఉండే పేర్ల జాబితా తయారు చేసి వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు పేజీలో పెట్టి నిర్ణయం తీసుకోవాలి.

ఎన్వికీ లింకులు ఇవ్వడం

[మార్చు]

వర్గాల పేజీలకు సంబంధిత ఎన్వికీ లింకులివ్వడం వలన ఎంత ఉపయోగమో పైన చెప్పాం. అలా లింకులు లేని వర్గాల జాబితాలు తయారు చేసి ఉంచాం. ఆ జాబితాల్లోని వర్గాలకు సరిసమానమైన ఎన్వికీ వర్గాలన్ము చూసి వాటికి వికీడేటాలో సైటు లింకు చేర్చాలి. ఈ జాబితాల్లో ఉన్న మొత్తం వర్గాల సంఖ్య: 8,445. నిర్వహణ వర్గాలను, ట్రాకింగు వర్గాలను, ఇంగ్లీషు వికీలో ఖచ్చితంగా ఉండని వర్గాలనూ (అన్నీ కలిపి దాదాపు 4 వేలు) ఈ జాబితా లోంచి తీసేసాం. ఆ జాబితాల జాబితా ఇది:

ఇవన్నీ కలిపి 6,443 వర్గాలు. వీటికి తోడు కింది వర్గాలు కూడా ఉన్నాయి.

  • ఇంగ్లీషు పేర్ల వర్గాలు - 189 వర్గాలు. వీటిని పట్టించుకోనక్కర్లేదు. దాదాపుగా అన్నీ నిర్వహణ వర్గాలే. ఉంటాయి. అలా కానివాటిని తేరువాత చూడవచ్చు.
  • వివిధ జిల్లాల్లోని వివిధ వృత్తులకు చెందిన వ్యక్తుల వర్గాలతో కూడిన జాబితా మరొకటి ఉంది. ఇందులో 1812 పేజీలున్నాయి. పెద్ద పరిమాణం కారణంగా దీనికి పేజీ తయారు చెయ్యలేదు. పైగా ఈ వర్గాలకు ఎన్వికీ లింకులు ఉండే అవకాశం తక్కువ.