వికీపీడియా:వికీబంధుత్వం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియన్లకు వికీపీడియాలో పనిచేస్తూండగా వ్యక్తిగతమైన అనుబంధాల స్థాయిలోని ప్రేమాభిమానాలు ఒక్కొక్కరిపై ఏర్పడుతూంటాయి. తెలుగు ఇళ్ళలో సొంత బంధువులా కాదా అన్నది పక్కనపెట్టి ఇలా అభిమానాలు కలిగినవారు చుట్టరికాలతో పిలుచుకుంటూంటారు. ఈ రెండు విషయాలను ఒకదానికొకటి కలిపి చూస్తే మనలో చాలామందికి తోటి వికీపీడియన్లలో కొందరిని స్వంత బంధువుల్లా పిలుచుకునే ఆప్యాయత కలుగుతుందన్నది తెలుస్తోంది కదా. అందుకే వికీబంధువులు అన్న పదం కాయిన్ చేసుకుని, మనలో మనకి అభిమానం కలిగినవారిని గౌరవప్రదమైన వరసలతో పిలుచుకోవడంలో పొరపాటు లేదు. (ఈ వ్యాసాన్ని ప్రారంభించేప్పుడు నా మనస్సులో పెద్దమ్మగారు అంటూ అభిమానంగా నేను పిలుచుకుంటూన్న సుజాత గారు, పెద్దనాన్నగారని పిలుస్తూన్న శ్రీరామమూర్తి గారూ ఉన్నారు.) అలాంటివారికి తమ అభిమానాన్ని, గౌరవాన్ని చెప్పగలిగేలా కొన్ని టెంప్లెట్స్ లాంటివి(ఇంగ్లీష్ వికీలో వికీలవ్ లాంటివి ఉన్నాయనుకుంటా) తయారుచేసి వాడుకుంటే బావుంటుంది. దీనివల్ల వికీ కమ్యూనిటీలో చక్కని అభిమానాలు, సహకారాలు పెరగవచ్చు.