వికీపీడియా:వికీమీడియా విశేషాలు
వికీమీడియా ఫౌండేషన్ అనేది ఒక లాభాపేక్ష లేని అంతర్జాతీయ సంస్థ. వివిధ భాషల్లో విజ్ఞానాన్ని ఉచితంగా అందించాలనే ఆశయానికి అంకితమైన సంస్థ ఇది. ప్రజల విరాళాలపై ఆధారపడి పనిచేస్తూ తన లక్ష్య సాధనకై పనిచేస్తోంది. విజ్ఞాన విషయాలను తయారుచేసే క్రమంలో, వికీమీడియా వివిధ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. విజ్ఞన సర్వస్వానికై వికీపీడియా ఉన్నట్లే, ఇతర విషయాలకై కింది ప్రాజెక్టులను కూడా నిర్వహిస్తోంది.
- విక్షనరీ
- వికీబుక్స్
- వికీకోట్
- వికీన్యూస్
- వికీసోర్స్
- వికీకామన్స్
మొదలైనవి. ఈ ప్రాజెక్టులలో వివిధ భాషలలో ఎడిషన్లున్నాయి. తెలుగులో వికీపీడియాతో పాటు, విక్షనరీ, వికీబుక్స్, వికీకోట్ కూడా ఉన్నాయి. అయితే వీటిలో పెద్దగా పని జరగడం లేదు. వికీబుక్స్‌లో మాత్రం కొందరు సభ్యులు చురుగ్గా పనిచేస్తున్నారు.
వివిధ భాషల్లోని వివిధ వికీప్రాజెక్టులు చూస్తూ ఉంటే కొత్త విషయాలు తెలుస్తాయనే ఉద్దేశ్యమే ఈ పేజీకి ప్రేరణ. ఇక్కడ ఆయా ప్రాజెక్టులలోని ఆసక్తికరమైన లింకుల జాబితాను కూర్చుదాము.
వికీమీడియా లింకులు
[మార్చు]వికీపీడియా లింకులు
[మార్చు]- మీరిప్పటి వరకు వికీపీడియాలో ఎన్ని రచనలు చేసారో ఇక్కడ చూడండి
- భాష విషయమై మనకున్న కష్టాల్లాంటివి హిందీ వాళ్ళకూ ఉన్నాయి పాపం