వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగస్టు 18

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సరైన సమాచారం, మంచి ప్రమాణాలు, సహచరులతో సంప్రదింపులు

(Accuracy, quality and peer review) - వికీపీడియాలో ఉన్న సమాచారం సరైనది, నిర్ధారింపదగినది, మంచి ప్రమాణాలతో ఉన్నది కావాలని మనందరి ఆశయం.

  • ఏదైనా విషయం సరి కాదని మీకు తెలిస్తే చొరవ తీసుకుని దిద్దుబాట్లు చెయ్యండి, ఆ వ్యాసం ప్రమాణాలను పెంచండి.
  • సరైన ఆధారాలు లేని సందేహాస్పదమైన సమాచారం ఉంటే తొలగించండి. మీకు అంత ఖచ్చితంగా తెలియకపోతే {{fact}} అనే మూస ద్వారా ఆధారాలు కోరవచ్చును.
  • ఇతరులు వ్రాసిన వ్యాసాలను చదివి అందులోని సమాచారం తప్పొప్పుల గురించి మీ అభిప్రాయాలను, సూచనలను ఆ వ్యాసాల చర్చా పేజీలలో వ్రాయండి. అలాగే మీరు వ్రాసిన విషయాలపై చర్చలను ఆహ్వానించండి.

వికీపీడియా గురించి తరచు వచ్చే కొన్ని విమర్శలకు సమాధానాలుగా ఉన్న ఆంగ్ల వికీ పేజీ Wikipedia:Replies to common objections చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా