వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగష్టు 8

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గూగుల్‌లో వెతికేప్పుడు వికీపీడియా సైటును ఎన్నుకోవడం లేదా మినహాయించడం

గూగుల్‌ వంటి వెతుకు యంత్రాలలో "తెలుగు"లో వ్రాసి వెతికితే వచ్చే ఫలితాలను గమనించండి. అంతర్జాలంలో తెలుగు యూనికోడ్ ప్రగతికి ఇదొక కొలమానం. గూగుల్ "వెతుకుపెట్టె" (search box)లో కొన్ని పరిధులు విర్ణయంచవచ్చును. ఉదాహరణకు మీరు "కాకతీయులు" అన్న పదం కోసం వెతుకుతున్నారనుకోండి.

  • "కాకతీయులు" - అని వ్రాసి వెతికితే అన్ని సైటులనుండి ఫలితాలు లభిస్తాయి.
  • "కాకతీయులు site:http://te.wikipedia.org" అని వ్రాసి వెతికితే, తెలుగు వికీపీడియా నుండి మాత్రమే ఫలితాలు వస్తాయి. ఆ పదం తెవికీలో ఏయే వ్యాసాలలో ఉందో తెలుసుకోవడానికి ఇదొక మార్గం.
  • "కాకతీయులు -site:http://te.wikipedia.org" అని వ్రాసి వెతికితే, తెలుగు వికీని మినహాయించి తక్కిన సైట్లు నుండి ఫలితాలు వస్తాయి. ఇది మీ పరిశోధనకు, వనరుల గురించి వ్రాయడానికి ఉపయోగ పడుతుంది.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా