వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగస్టు 31
స్వరూపం
ప్రపంచంలో ఏ ఒక్కరి అబిప్రాయాలు ఒకలా ఉండవు.కాబట్టి వ్యాసాలు రాసేటప్పుడు సభ్యుల మద్య అభిప్రాయ బేధాలు రావడం సహజం. అలాంటప్పుడు వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడం ఉత్తమమైన పద్దతి. వీలైతే ఇతర సభ్యుల అభిప్రాయాలను ఆహ్వానించండి. చర్చా పేజీలలో పరుష పదజాలను వాడకండి. ఎందుకంటే తాము పని చేసే సమయంలో కొంత వెసులుబాటు ను కల్పించుకుని వికీపీడియాలో రచనలు చేస్తున్న సభ్యులు మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంతవరకు తటస్థ దృక్కోణంతో వ్యాసాలు రాయండి. ఇలాంటి వివాదాస్పద విషయాలు చర్చించేటపుడు. మీ సభ్యనామంతో చర్చిస్తే బాగుంటుంది. మీకు వాదనకు దిగే ఆలోచన లేక పొతే వేరే వ్యాసాల వైపు దృష్టి సారించండి.