వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబర్ 17, 2007
Appearance
మీరు వికీపీడీయాలో కొత్తగా చేరారా? అంతా గజిబిజిగా ఉందా? మీరు సహాయం కోసం చూస్తున్నారా? మీకు సహాయం కావాలంటే ఎక్కడో ఎవర్నో అడగక్కరలేదు. మీ చర్చాపేజీలో {{సహాయం కావాలి}} అని చేర్చండి. నిమిషాల్లో మీకు సహాయం చేయడానికి ఎవరో ఒక వికీ సభ్యుడు/సభ్యురాలు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మీరు ఇతర వికీ సభ్యులతో చర్చించడానికి ఆ సభ్యుని చర్చాపేజీలో రాయవచ్చు. సభ్యుల పేజీలకు లింకులు సాధారణంగా వారి సంతకాల్లో గాని ఇటీవలి మార్పులు పేజీలో గాని, ఏదైనా వ్యాసం యొక్క చరితం పేజీలో గాని లేదా పూర్తి సభ్యుల జాబితాలోగాని ఉంటాయి. మీరు నిర్మొహమాటంగా సభ్యులను సహాయంకోసం అడగవచ్చు. సహాయంకోసం అన్నింటికంటే ఉత్తమమైన లింకు ఇటీవలి మార్పులు పేజీనే! ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతము తెలుగువికీ తెరచి మార్పులు చేస్తున్న సభ్యులను కలవవచ్చు.