వికీపీడియా:వికీ చిట్కాలు/డిసెంబర్ 8, 2007
Jump to navigation
Jump to search
పేజీ చరితం
వికీపీడియాలో దిద్దుబాట్లు చెయ్యగలిగే ప్రతిపేజీకి, సంబంధిత పేజీ చరితం ఉంటుంది. పేజీలో జరిగిన అన్ని మార్పులు తేదీ, సమయాల తిరగేసిన క్రమంలో పేజీ చరితంలో కనిపిస్తాయి. దీన్ని కూర్పు చరితం అని, దిద్దుబాటు చరితం అని కూడా పిలుస్తారు. దిద్దుబాట్లు సరికొత్త దాని నుండి అన్నిటికంటే పాతదాని వరకు వరుసలో ఉంటాయి. ఒక్కో దిద్దుబాటు వివరం ఒక్కో వరుసలో ఉంటుంది. దీనిలో తేదీ సమయం, వాడుకరి పేరు లేదా ఐపీ అడ్రసు, దిద్దుబాటు సారాంశం మొదలైన వాటితో పాటు ఇతర సమాచారం కూడా ఉంటుంది.
ఇంకా: పేజీ చరితం