Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 15, 2007

వికీపీడియా నుండి
పేజీని వర్గీకరించకుండా వర్గానికి లింకు ఇవ్వడం ఎలా

పేజీని ఒక వర్గానికి చేర్చాలంటే "[[వర్గం:వర్గం పేరు]]", అని రాస్తే ఆ పేజీ సదరు వర్గానికి చేరుతుందని అనకు తెలుసు. అలా పేజీని వర్గానికి చేర్చడం కాకుండా, కేవలం ఆ వర్గానికి లింకు ఇవ్వడం మాత్రమే చెయ్యాలంటే (వేరే పేజీకి లింకు ఇచ్చినట్లు), ఇలా రాయాలి: :"[[:వర్గం:వర్గం పేరు]]". (ట్యాగులో అన్నిటి కంటే ముందు రాసిన కోలన్ను (:) గమనించండి.)

ఉదాహరణకు:

ఫలానా వ్యాసాన్ని ఫలానా వర్గానికి చేర్చడం సబబుగా ఉంటుంది అని రాసే సందర్భంలో "ఈ వ్యాసాన్ని [[వర్గం:వికీ చిట్కాలు]] కు చేరిస్తే సబబుగా ఉంటుంది" అని రాస్తే, ఇలా కనిపిస్తుంది:

"ఈ వ్యాసాన్ని కు చేరిస్తే సబబుగా ఉంటుంది". పేజీ "వికీ చిట్కాలు" వర్గంలోకి చేరుతుంది.

అలా కాక, "ఈ వ్యాసాన్ని [[:వర్గం:వికీ చిట్కాలు]] కు చేరిస్తే సబబుగా ఉంటుంది" అని రాస్తే, ఇలా కనిపిస్తుంది:

"ఈ వ్యాసాన్ని వర్గం:వికీ చిట్కాలుకు చేరిస్తే సబబుగా ఉంటుంది"
మరిన్ని వివరాల కోసం వికీపీడియా:వర్గీకరణ చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా