వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 21, 2007
Jump to navigation
Jump to search
ఒకటికంటే ఎక్కువ పేజీలలో వాడడానికి వీలుగా మూసలు
ఒకసారికంటే ఎక్కువ వాడకం కల పేజీలను మూసలు (templates) అని అంటారు. మూసల పేర్లు మూస: అనే పదంతో ప్రారంభమవుతాయి. ఒక మూసను ఇతర పేజీల్లో వాడడానికి {{మూస పేరు}}, అనే సింటాక్స్ వాడాలి. ఈ మీసాల బ్రాకెట్లలో మూస: అని వ్రాయవలసిన అవసరం లేకుండానే మూసలు కావాల్సిన పేజీలో ప్రతిష్టింపబడతాయి.
మన తెలుగు వికీపీడియాలో అనేకమైన మూసలు ఇప్పటికే ఉన్నాయి. ఉదాహరణకు మూస:దక్షిణ ఆసియా లాంటి నావిగేషనల్ పెట్టెలను, మూస:సమాచారపెట్టె భాష వంటి సమాచార పెట్టెలను చెప్పుకోవచ్చు.