వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 9, 2007
Appearance
(వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 9 నుండి దారిమార్పు చెందింది)
వికీపీడియాలో ఒక ఎర్రని లింకు కనిపిస్తే దాని అర్థం ఆ లింకుకు సంబంధించిన పేజీ లేదని అర్థం. ఆ ఎరుపు రంగులను చేసిన వారి ఉద్దేశ్యము క్రింది వాటిల్లో ఏదో ఒకటి అయి ఉండవచ్చు.
- లింకు తెగిపోయి ఉండవచ్చు (ఆ లింకుకు సంబంధించిన పేజీ తొలగించబడడం వల్ల). ఆటువంటి సమయంలో ఆ లింకును తొలగించాలి లేదా అర్థవంతమయిన ఇంకో పేజీ లింకు తగిలించాలి.
- ఒక కొత్త వ్యాసం గాని, మూస గాని, పేజీగాని కావాలని అర్థం. సాధారణంగా ఒక వికీపీడియన్ వ్యాసం ప్రారంభించినపుడు వికీపీడియాలో లేని వ్యాసాలకు కూడా లింకులు తగిలిస్తుంటారు. వారి ఉద్దేశ్యం కింది విధంగా ఉండొచ్చు.
- లింకులున్న వ్యాసాలను మున్ముందు తయారు చేసే ఉద్దేశ్యం ఉండవచ్చు.
- కొన్నిసార్లు చిట్టాలలో(లిస్ట్‌లలో) వికీపీడియన్‌కు తోచిన విషయాలను చేర్చుతారు. అప్పుడు ఒక విషయంలో ఇంకా చేర్చవలసిన విషయాలు ఎరుపురంగులో కనబడతాయి.
గమనిక: ఎర్ర లింకులు కనబడే విధానం అలా కాకుండా వేరే విధంగా కూడా - ఎరుపు రంగుకు బదులుగా లింకు పేరు పక్కనే "?" గుర్తు (ప్రశ్నార్థకం) వచ్చేలా - ఉండవచ్చు. ఎలా కనబడాలనే విషయాన్ని మీ అభిరుచులలో స్థిరపరచుకోవచ్చు.