వికీపీడియా:వికీ చిట్కాలు/మే 21
Appearance
ప్రతి పదానికీ మూలాలు చూపాలంటే వ్యాసం గందరగోళంగా కావచ్చును. అసలు వ్యాసం వ్రాయడమే కుదరకపోవచ్చును. వ్రాసే విషయం యొక్క ప్రాముఖ్యతను బట్టి, దానిని ఇతరులు ప్రశ్నించే అవకాశాన్ని బట్టి విచక్షణతో ఈ మూలాల ఆవశ్యకతను గుర్తించాలి.
- నన్నయ మహాభారతాన్ని తెలిగించడం మొదలుపెట్టాడు - మూలం అవసరం లేదు.
- నన్నయ రచనలలో ప్రసన్న కధాకలితార్ధయుక్తి, అక్షర రమ్యత, సూక్తి సుధత్వము ఉన్నాయి - మూలం చూపడం మంచిది.
- నన్నయ కంటే నన్నెచోడుడు ముందరివాడని ఒక అభిప్రాయం ఉంది - మూలం చూపడం అవసరం.
క్లుప్తంగా - విషయం బరువునుబట్టి మూలం చూపవలసిన అవసరం పెరుగుతుంది