వికీపీడియా:వికీ చిట్కాలు/మే 30
స్వరూపం
మీరు స్వచ్ఛందంగా పని చేస్తున్నారని మీకు తెలుసనుకోండి. కాని ఇతర సభ్యుల విషయానికొచ్చేసరికి ఈ స్థితిని (మీకు తెలియకుండానే, మీకా ఉద్దేశ్యం లేనప్పటికీ) విస్మరించడం జరిగే ప్రమాదం ఉంది - ఈ తప్పు ఇంకా ఎందుకు దిద్దలేదు? నా ప్రశ్నకు జవాబు ఎందుకు ఇవ్వలేదు? ఆ వ్యాసం మొదలుపెట్టి ఇంతకాలం ఎందుకు అనువదించలేదు? - వంటి ప్రశ్నలన్నీ ఎదుటివారి స్వచ్ఛందతను గుర్తించకుండా అడిగేవే. వారిష్టం. మీకు కుదిరితే మీరు దిద్దండి. లేదంటే వేచి చూడండి. అన్య మార్గం లేదు.