వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 6

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లింకులు వ్రాసే విధానం

వికీపీడియా వ్యాసాలలో లింకులు చాలా ముఖ్యమైనవి, ప్రాధమికమైనవి. క్రొత్త సభ్యులు తెలిసికోనలసిన మొదటి విషయాలలో ఇది ఒకటి. ఉదాహరణకు - ప్రస్తుతానికి తెలుగు వికీలో గ్రామాలు గురించిన వ్యాసం పేరు గ్రామం. దీనిని వివిధ సందర్భాలలో ఇలా వాడవచ్చును.

  • నేరుగా -- [[గ్రామం]] అని వ్రాస్తే గ్రామం అని లింకు వస్తుంది.
  • పదంలో భాగంగా -- [[గ్రామం]]లో అని వ్రాస్తే గ్రామంలో అని లింకు వస్తుంది.
  • కొంచెం అక్షర భేదంతో -- [[గ్రామం|గ్రామాలు]] అని వ్రాస్తే గ్రామాలు అని లింకు వస్తుంది. ఇక్కడ మనకు "గ్రామాలు" అని కనిపిస్తుంది కాని "గ్రామం అన్న వ్యాసానికి లింకు వస్తుంది. అలాగే [[గ్రామం|పల్లెటూరు]] అని వ్రాస్తే పల్లెటూరు అని లింకు వస్తుంది. అంటే "పల్లెటూరు" అని కనిపిస్తుంది కాని "గ్రామం" వ్యాసానికి లింకు ఉంటుంది.
  • దాఱి మార్పు -- "గ్రామము" అని కూడా తరచు వ్రాస్తుంటారు గనుక దీనికి ఒక దారి మార్పు పేజీ తయారు చేయబడింది. అనగా గ్రామము అనే వ్యాసంలో #REDIRECT [[గ్రామం]] అని వ్రాయబడింది. కనుక "గ్రామము" అనే వ్యాసం ఆటొమాటిక్‌గా "గ్రామం" వ్యాసానికి మళ్ళుతుంది.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా