వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబర్ 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేను వ్రాసిన వర్గం లింకు కనబడడం లేదు

వికీపీడియా వర్గాలను ట్యాగ్‌లుగా పరిగణిస్తుంది. లింకులుగా కాదు. రచన మధ్యలో "ఫలానా వర్గం చూడండి" అని మీరు వ్రాయాలనుకోవచ్చును. ఉదాహరణకు "తెలుగు కవులు" అనే వర్గం చూడండి అని మీరు వ్రాయాలనుకొన్నారనుకోండి.

  • [[వర్గం:తెలుగు కవులు]] చూడండి - అని మీరు వ్రాసినట్లయితే, పేజీలో అసలు ఆ లింకు కనిపించదు. పేజీ క్రింద మాత్రం "వర్గం:తెలుగు కవులు" అని కనిపిస్తుంది. అంటే ఆ పేజీ "తెలుగు కవులు" అనే వర్గంలో చేరిందన్నమాట.
  • [[:వర్గం:తెలుగు కవులు]] చూడండి - అని మీరు వ్రాసినట్లయితే, వర్గం:తెలుగు కవులు చూడండి అని కనిపిస్తుంది. "వర్గం" అనే పదానికి ముందు ఒక "కోలన్" (:) గుర్తు ఉంది గమనించండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా