వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 11

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ్యాసంలో పలుమార్లు వచ్చే రిఫరెన్సుల గురించి

ఒక వ్యాసం వ్రాయడానికి మీరు ఒకటి రెండు పుస్తకాలు లేదా వెబ్‌సైటులను ప్రధాన రిఫరెన్సులుగా వాడారనుకోండి. అంటే వీటిని వ్యాసంలో అనేకమార్లు ఉట్టంకించవలసి ఉండవచ్చును. అందుకు ఈ విధంగా మీరు వ్యాసంలో వ్రాయవచ్చును.

మొట్టమొదటిసారి ఆ రిఫరెన్సును వాడినప్పుడు పూర్తి వివరాలు, మరియు రిఫరెన్సుకు ఒక ప్రత్యేక నామం ఇవ్వండి. అంటే ఇలా

 <ref name="ABC"> ఫలానా పుస్తకం,  రచయిత, ప్రచురణ, వెబ్ సైటు  </ref> 
 

తరువాత మళ్ళీ ఆ రిఫరెన్సును వాడడానికి దాని ప్రత్యేకనామం చాలును. ఇలాగన్న మాట.

 <ref name="ABC"/>

వ్యాసం చివరలో {{మూలాలజాబితా}} అన్న మూసను వ్రాయడం మరచిపోవద్దు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా