Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 10

వికీపీడియా నుండి
ఇతరుల సమయాన్ని వృధా చేయకండి

వికీపీడియాలో పని చేసేవారందరూ తమ విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నారని మీకు తెలుసు. వారి సమయాన్ని వృధాగా ఖర్చుపెట్టేలా చేయడం తగదు. ఇతరుల సమయం సద్వినియోగం అయ్యేలా ఉండడానికి మీరు ఇలా సహకరించవచ్చును [1] --

  • దిద్దుబాట్ల సారాంశం వ్రాయండి - మీరు ఏదైనా ఎడిట్ చేసినపుడు అది సేవ్ చేసేముందు దిద్దుబాటు సారాంశం బాక్స్‌లో "అక్షర దోషాల సవరణ", "బొమ్మ చేర్పు", "విర్ధారం లేని విషయం తొలగింపు", "అనువాదం" - ఇలా మీరు చేసిన పని సారాంశం వ్రాస్తే ఇతరులకు సులువుగా మీ మార్పు అర్ధమవుతుంది. అది కనుక్కోవడానికి వారు శ్రమించనక్కరలేదు.
  • పట్టుదలలు, వివాదాలు తగ్గించండి. - మీరు ఏదైనా ప్రశ్న లేదా అభ్యంతరం లేవనెత్తినపుడు అందుకు సంబంధించిన ఆధారాలు, హేతువులు స్పష్టంగా (వ్యాసంలో గాని, చర్చాపేజీలో గాని) ఇవ్వండి. అంతే గాని మీరు లేవనెత్తిన సమస్యకు పరిష్కారం కోసం ఇతరులు శ్రమించలేరు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా